For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వికటించిన హీరో తరుణ్..సహజీవనం

  By Srikanya
  |

  హైదరాబాద్ : చాలా కాలం క్రితం ప్రారంభమై,ఆగిపోతూ దర్శకులను మార్చుకుంటూ వెళ్లిన చిత్రం 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి'. తరుణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా నిన్న(శనివారం)విడుదలైంది. అయితే ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ కాకపోతేనే తరుణ్ కి బాగుండేది అని చాలా మంది కామెంట్ చేసుకోవటం కనిపించింది.

  హిందీ హిట్ సలామ్ నమస్తే చిత్రానికి నకలుగా తయారైన ఈ చిత్రంలో తరుణ్..సంజయ్ గా కనిపిస్తాడు. తన తండ్రి చేస్తున్న బిజినెస్ చూసుకోమంటే...ప్రీడం కావాలని ధాయ్ వెళ్లి అక్కడ టీవీ ఛానెల్లో లవ్ గురు అనే టీవీ పోగ్రాం వారానికి ఓ సారి చేస్తూ మిగిలిన రోజుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూంటాడు. అక్కడే సమీర(విమలారామన్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె మన హీరోకి క్వయిట్ కాంట్రాస్ట్. భాథ్యతగల అమ్మాయి. అక్కడ మెడిసన్ చేస్తూంటుంది. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమదాకా తీసుకు వెళ్తాడు.

  ఇక వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందాం అని ఫిక్సైన సమయంలో అతనికి భాథ్యతలు తీసుకోడని,పట్టించుకోడని రివిల్ అవుతుంది. అప్పుడు నా గురించి నువ్వు,నీ గురించి నేను బాగా తెలుసుకుందాం,కొద్ది రోజులు సహజీవనం చేద్దాం అని ప్రపోజ్ చేస్తాడు. ఒప్పుకున్న ఆమె చివరకు సంజయ్ ని పెళ్లి చేసుకుందా...సంజయ్ భాధ్యతలు నేర్చుకున్నాడా అనేది మిగతా కథ.

  ఇక ఈ చిత్రం బాగా లేటుగా ముస్తాబు అవటం వల్లనో ఏమో కానీ కంటిన్యుటీ అనేది పూర్తిగా మిస్సైంది. ముఖ్యంగా తరుణ్ ఇలా కూడా నటిస్తాడా అన్నంత దారుణంగా చేసాడు. విమలారామన్ కూడా అంతే. శాటిలైట్ కోసం ప్యాడింగ్ ఆర్టిస్టులు ని నింపినట్లు బ్రహ్మానందం, ధర్మవరపు, కనిపిస్తారు. అంతేగాక వారు డబ్బింగ్ కి వచ్చినట్లు లేరు. దాంతో వేరే వారు చేత డబ్బింగ్ చెప్పించారు.

  అలాగే ఈ సినిమాకు పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే. చాలా బోరింగ్ గా,చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం సాగుతూంటాయి. తరుణ్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయిన దశలో ఈ చిత్రం విడుదలకు అవటంతో ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. అయితే శృంగారం కలిసిన చిన్న చిత్రాలకు డిమాండ్ ఉందనే అభిప్రాయంలో మార్కెట్లో ఈ చిత్రాన్ని పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

  ఫైనల్ గా ఈ చిత్రం టీవిల్లో వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయటం బెస్ట్. తరుణ్ ఇలాంటి సినిమాల్లో నటించటం కన్నా.. చక్కగా కాలానికి తగినట్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి...కెరీర్ ని మళ్లీ గాడిన పెట్టుకోవటం అవసరం.

  English summary
  
 Tarun's Chukkalanti Ammayi Chakkanaina Abbayi released yesterday with Flop talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X