ఈ హాట్ హీరోయిన్ పెళ్లి కుదిరింది!
హైదరాబాద్: తెలుగులో సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తున్న తషు కౌషిక్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. తషు చిన్న నాటి మిత్రుడు దేవంగ్ రాజ్ తయాల్ జనవరి 4న కుటుంబ సభ్యుల సమక్షంలో కాన్పూర్‌లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి భాజాలు మ్రోగనున్నాయి.
దేవంగ్ పెద్ద వ్యాపారి. బాగానే సంపాదిస్తున్నాడు. తన భర్త సంపాదనకు తాను తోడవుతానని అంటోంది. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి బిజినెస్ వ్యవహారాల్లో మునిగి పోవాలని నిర్ణయించుకుంది. రాజస్తాన్ లోని హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది.

తెలుగులో రాజు మహరాజు, దుశ్శాసన, వైకుంఠపాళి, గోల శీను చిత్రాల్లో నటించిన తషు ప్రస్తుతం మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె చివరి చిత్రం. సినిమా రంగంలో తన కెరీర్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది.
తషు కౌషిక్ వయసు 29 సంవత్సరాలు. 2006లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన దర్వాజ బంద్ కరో అనే హిందీ చిత్రం ద్వారా వెండి తెరంగ్రేటం చేసింది. అంతకు ముందు పలు టీవీ యాడ్లలో నటించింది. రాజు మహారాజు ద్వారా దక్షిణాది పరిశ్రమలో అడుగు పెట్టింది. చిన్న చితకా సినిమాలే తప్ప పెద్దగా అవకాశాలు రాలేదు. అందాలు ఆరబోస్తూ ఎన్ని ఫోటోషూట్లు చేసినా పరిస్థితి మారలేదు.


Click it and Unblock the Notifications











