»   » పవర్‌ స్టార్‌ సినిమాతో టాటా డొకోమో ఒప్పందం

పవర్‌ స్టార్‌ సినిమాతో టాటా డొకోమో ఒప్పందం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : పవర్‌ స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన పవర్‌స్టార్‌ సినిమా (తెలుగులోని దూకుడు రీమేక్‌)తో టాటా డొకోమో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా ప్రచారం నిర్వహిస్తాయి. శనివారం రాత్రి ఇక్కడి ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా టాటా డొకోమో జి

ఎస్‌ఎం వినియోగదారులకు రూ.33కే రీఛార్జ్‌ సదుపాయాన్ని ప్రకటించింది. కార్యక్రమంలో డొకోమో ప్రతినిధి రోహిత్‌ టాండన్‌, పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన పవర్‌ స్టార్‌ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఆడియోను లహరి సంస్థ మార్కెట్‌ చేస్తోంది.

మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మిస్తున్నారు. మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు. రీసెంట్ గా ఆడియో పంక్షన్ నిర్వహించి, ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావటంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.

Tata Docomo ties up with Power!

అలాగే 'పవర్' ఆడియో కార్యక్రమానికి మహేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ ఆడియో వేడుకకి మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బళ్లారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది మహేష్ బాబు కోసం ఈ ఆడియో వేడుకకి వచ్చారు. దాంతో ఆ విథంగా కూడా చిత్రానికి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.

English summary
A lot of speculation has surrounded the name of Puneeth Rajkumar's upcoming film, which is the remake of the Telugu hit Dookudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu