ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో పోషించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ప్రస్తుతం థియేటర్లలో ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోనూ గ్రాండ్ గా విడుదల చేసిన సమయంలో సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీలో టీడీపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు పలు సందర్భాల్లో విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా దూషించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చగా మారింది. ఏకంగా పచ్చి బూతులు మాట్లాడుతుండటం ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టు ఆడియో ద్వారా తెలుస్తోంది.

TDP MLA Daggupati Prasad Audio Conversation on Jr NTR gone viral

వార్ 2 షోలను నిలిపివేయాలని, ఇక్కడ వార్ 2 సినిమా ప్రదర్శనకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిపై విరుచు పడ్డాడు. అస్సలు ఇక్కడ వార్ 2 చిత్రం ఆడదు. ఆడనివ్వం అంటూ ఆడియోలో ఉన్న సారాంశం. ఇక ఆ ఆడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని నిరసన తెలుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ పై వ్యక్తిగతంగానూ, అటు రాజకీయ పరంగానూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

అధికార పక్షం అండదండలతోనే సదరు ఎమ్మెల్యే అలాంటి దారుణమైన మాటలు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఆ ఎమ్మెల్యే అంతటి సాహం చేయబోరని అంటున్నారు. ఇక ఈ ఆడియో లీక్ వ్యవహారంపై తాజాగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. అసలు ఆ ఆడియోను తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఎవరో కావాలని, తనమీద రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తనపై గిట్టని వారెవరూ ఉద్దేశపూర్వకంగా AI ద్వారా క్రియేట్ చేసిన ఆడియో ఫైల్ అని చెప్పుకొచ్చారు.

ఈ విషయం తన తప్పేమీ లేదని, ఇక ఎవరైనా జూ.ఎన్టీఆర్ అభిమానులు మానస్ఫార్థానికి గురైతే క్షమించగలరని అన్నారు. అది తనకు సంబంధించిన ఆడియో కాదని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యే స్పందించడంతో ఫ్యాన్స్ కాస్తా చల్లారు. ఇక ఈ ఆడియో వ్యవహారం ఇంతటితో ఆగుతుందా? లేదా? అనేది చూడాలి. మరోవైపు వార్ 2 సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఇలా ఆడియో బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: jr ntr war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X