»   » అమ్మ పేరుకీ గౌరవం... మాకా నామ్: బాలకృష్ణ బాటలో టీమ్ ఇండియా

అమ్మ పేరుకీ గౌరవం... మాకా నామ్: బాలకృష్ణ బాటలో టీమ్ ఇండియా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఒక వ్యక్తి తన పేరుని ఏ ఫారం లోనింపాల్సి వచ్చినా, ఎక్కడైనా ఎవరి కొడుకో చెప్పుకోవాల్సి వచ్చినా "సన్ ఆఫ్ అంటూ" తండ్రి పేరుని మాత్రమే చెప్పటం ఒక ఆనవాయితీ అయ్యింది. కొన్ని వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకు పోయిన పితృస్వామ్య వ్యవస్త వల్ల వచ్చిన ఈ అలవాటుని బద్దలుకొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా మార్పు లష్తమే అయ్యింది. బుద్దుడు తల్లి పేరుని కలుపుకొని గౌతమ బుద్దుడైతే... శాతవాహన రాజు, తొలి శాతవాహనుల్లో చివరివాడు అయిన 23వ రాజు తన తల్లి గౌతమీ బాలాశ్రీ పేరుని చేర్చుకొని "గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు.

  ఆ రాజు కథనే ఇతివృత్తంగా చేసుకొని నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం "గౌతమి పుత్ర శాతకర్ణి".క్రిష్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం తెలుగు నేలను రాజధాని గా చేసుకుని ప్రపంచాన్ని ఏలిన గొప్ప తెలుగు చక్రవర్తి కథ.మన చరిత్ర లో పితృస్వామ్య కథలే వినిపిస్తాయి.అలంటి రోజుల్లో కూడా మాతృమూర్తి పేరు మీద శిలాఫలకాలతో పాటు తన పేరు ముందు కూడా పేరు జోడించుకున్నారు.అందుకే శాతకర్ణి ని "గౌతమీ పుత్ర శాతకర్ణి" అని పిలిచేవారు. పితృస్వామ్య వ్యవస్థ విపరీతంగా ఉండే రోజుల్లో.. ఆ సమాజాన్ని ఎదిరించి తల్లి నామాన్ని పేరుకు ముందు తగిలించుకుని గౌతమి పుత్రుడిగా మారాడు శాతకర్ణి. ఆ శాతకర్ణినే ఫాలో అవుతూ ఇటీవల 'బసవతారక పుత్ర బాలకృష్ణ' అని పేరు వేయించుకున్నాడు బాలయ్య. బాల కృష్ణ ఇక్కడ చేసిన పని టీమ్ ఇండియా సభ్యులకి తెలియక పోవచ్చు గానీ ఆ ఆలోచనని ముందే ప్రారంబించి ఆచరించాడు బసవతారక పుత్రుడు

  Team india fallows nandamuri balakrishna

  ఇటివలే బీసీసీఐ "మా కా నామ్" అనే కాంపెయిన్ లో భాగం గా టీం ఇండియా క్రికెటర్లు తల్లి పేరుతో వుండే జెర్సీ లు వేసుకుని కనిపించారు. ధోని, కోహ్లి, రహనే, వాళ్ళ తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు. ధోని, తన తల్లి పేరు దేవకీ, కోహ్లి తన తల్లి పేరు సరోజ్, రహనే తన తల్లి పేరు సుజాతా పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని ఈ కాంపెయిన్ కు తమ వంతు సహకారం అందించారు.. ఈ కాంపెయిన్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఏది ఏమయినా ఇలా మాతృ మూర్తి కి గౌరవం ఇవ్వడం అనేది హర్షించదగిన అంశం...

  English summary
  Very recent Tollywood hero Balakrishna mentioned his Name as "Basava taaraka putra Balakrishna" as Tribute for his mother Basavatarakam, in the Same Way Indian cricketers placed their Mothers Name on Jerseys.., MS Dhoni’s mother Devki Dhoni, Virat Kohli’s mother Saroj Kohli and Ajinkya Rahane’s mother Sujata Rahane...
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more