రూల్ నెం.1 : సుధీర్ బాబు 'మోసగాళ్లకు మోసగాడు' టీజర్(వీడియో)
హైదరాబాద్ :"లైఫ్ లో పైకిరావాలంటే రెండే రెండు రూల్స్..అందులో నెంబర్ వన్ ఏమిటంటే...మనకు తెలిసింది అంతా వేరే వాళ్లకు చెప్పకూడదు",
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. స్వామి రారాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ బాబు సరసన నందిని అనే కొత్తమ్మాయి హీరోయిన్. చక్రి చిగురుపాటి నిర్మాత. బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రోమో ఉగాది సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. మీరు ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కృష్ణ హీరోగా1971లో రూపొందిన 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు తెరపై కౌబారు కథాంశంతో రూపొందిన తొలి సినిమాగా ఖ్యాతినార్జించిన ఈ చిత్రం దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత ఇదే టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు.

క్రైమ్ కామెడీ ఎంటరటైనర్‌గా 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'స్వామిరారా' చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న ఈ సీక్వెల్‌కు 'మోసగాళ్లకు మోసగాడు' అనే టైటిల్ ఖరారు చేసి ఇలా ప్రోమో వదిలారు.
కృష్ణ మాట్లాడుతూ... నేను హీరోగా నటించిన 'మోస గాళ్లకు మోసగాడు' ముప్పై సార్లు విడుదలై మంచి వసూళ్లను సాధించింది. అదే పేరుతో వస్తోన్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అన్నారు.


Click it and Unblock the Notifications











