»   » పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కోసం నోరుపారేసుకున్న నాగబాబు...!?

పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కోసం నోరుపారేసుకున్న నాగబాబు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తన ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ నటించి తాజాగా విడుదలైన చిత్రం తీన్‌మార్. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటా మంచి టాక్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ తీన్‌మార్ చిత్రానికి మంచి టాక్ వచ్చిందన్నారు. అయితే, ఈ చిత్రం విడుదలైన ఒక్కరోజులోనే పైరసీ సీడీలు మార్కెట్‌లోకి వచ్చాయన్నారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేనిపక్షంలో చిత్ర పరిశ్రమ బతికిబట్టకట్టడం అసాధ్యమని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ చిత్ర సూపర్‌హిట్‌ ను జీర్ణించుకోలేని కొంతమంది పెద్దలు ఏవేవో మాట్లాడుతూ నెగటివ్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి వారికి ఒక్కటే చెప్పదలచుకున్నట్టు తెలిపారు. ఈ చిత్రం నచ్చక పోతే నోరు మూసుకుని కూర్చోవాలని నాగబాబు చురక అంటించారు. అలాగే, చిత్ర నిర్మాణ గణేష్ మాట్లాడుతూ చిత్రం మల్టీప్లెక్స్ థియేటర్లలో హౌస్‌ఫుల్‌ షోలతో ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని తిలకించేందుకు జనం పిచ్చిపిచ్చిగా తరలి వస్తున్నారన్నారు.

ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే నాకే పిచ్చెక్కెలా ఉందన్నారు. అంతే కాదు నిజాం ఏరియాలో 1.7కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సష్టించిందని. మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ 9కోట్లు కలెక్ట్ చేసినందకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇలాగా పాసిటివ్ టాక్ తో కొనసాగితే మరికొన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు గణేష్ బాబు.

English summary
Naga Babu, who was also present at the press conference, requested Pawan Kalyan’s fan and people in general to not encourage piracy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu