»   » ‘తీన్ మార్’ బ్యూటిఫుల్ విశేషాలతో త్రిష...

‘తీన్ మార్’ బ్యూటిఫుల్ విశేషాలతో త్రిష...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నయ్ ముద్దుగుమ్మ త్రిష ఆశలన్నీ ఇప్పుడు 'తీన్ మార్' మీదే వున్నాయి. తెలుగులో ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తన కెరీర్ పుంజుకుంటుందని ఆశపడుతోంది. అందుకే, ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుతోంది. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో త్రిషతో జరిపిన ఇంటర్వ్యు విశేషాలు...

'ఈ సినిమాలో నటించడానికి నాకు నచ్చిన అంశాలు చాలా వున్నాయి. ఒక్కటని చెప్పలేను. ముందుగా ఈ కథ నాకు బాగా నచ్చింది. మామూలుగా ప్రేమ కథలన్నీ రొటీన్ గా వుంటాయి. అందుకే వినడం కూడా ఏదో మొక్కుబడిగా వింటాం. కానీ, ఇది అలాంటి కథ కాదు. చాలా కొత్తగా సాగుతుంది. వినగానే 'అరె..చాలా బాగుందే' అనిపించింది. అందుకే, చేయాలనుకున్నాను. అదీ కాకుండా పవన్ కల్యాణ్ సినిమా అనగానే టెంప్ట్ అయ్యాను.

ఇప్పుడు సినిమా చూస్తుంటే ఓ మంచి సినిమా చేశానన్న తృప్తి కలుగుతోంది". 'గతంలో బంగారం సినిమాలో గెస్ట్ గా చేశాను. ఇది పూర్తి స్థాయి పాత్ర. తను మంచి ఆర్టిస్టు. ఆయనతో చేస్తే మనకు కూడా ఎంతో ఉత్సాహం వస్తుంది. బయట తను మామూలుగా కామ్ గా కనిపిస్తారు. క్యారెక్టర్ లోకి ఎంటరయ్యారంటే మాత్రం ఇక సందడే సందడి. సినిమా మీడియం పట్ల ఆయనకు ఫుల్ కమాండ్ వుంది. ఆయనతో నటించడం వల్ల ఎంతో తెలుసుకున్నాను".

పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ షూటింగ్ 'ఫుల్ ఎంజాయ్ చేశాం. చాలా లోకేషన్లలో షూటింగ్ చేశాం. అన్నీ కొత్త ప్రదేశాలే. చాలా హ్యాపీగా గడిచింది. ప్రతి రోజూ సందడిగానే వుండేది. ఇక టైటిల్ కూడా మాకు బాగా నచ్చింది. విచిత్రమేమిటంటే, రకరకాల పేర్లు అనుకున్నప్పటికీ, చివరి వరకూ ఏదీ ఖరారు కాలేదు. చివరి షెడ్యుల్ మైసూర్ లో జరుగుతున్నప్పుడు ఓ రోజు నిర్మాత గణేష్ వచ్చి, మన టైటిల్ 'తీన్ మార్' అన్నారు. అందరికీ భలే అనిపించింది. ఎందుకంటే, సినిమాలో మంచి మ్యూజిక్ కూడా వుంది".

'ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేసినా, నా కెరీర్లో నాకు చాలెంజ్ గా నిలిచినవి కొన్నే వున్నాయి. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', 'ఆకాశమంత ...' సినిమాల తర్వాత ఈ 'తీన్ మార్' నాకు అలాంటి అనుభూతినిచ్చింది. కష్టపడి చేయాల్సి వచ్చింది. నేనే కాదు, అంతా కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గా ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాను".

English summary
Pawan Kalyan, Kriti Kharbanda and Trisha's film 'Teen Maar' film is going to release on 14th April worldwide with more than 1000 prints. Censor Board gave clean U certificate for this film. Already released 'Theen Maar' audio got good response.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu