»   » హిట్ కోసం...( ‘1000 అబద్దాలు’ప్రివ్యూ)

హిట్ కోసం...( ‘1000 అబద్దాలు’ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తేజ చిత్రాలంటే మొదటి నుంచి ఓ ట్రేడ్ మార్క్. ఏదో ఒక కొత్త ఆలోచన, ఎంటర్టైన్మెంట్ ఉంటూంటుంది. అయితే గత కొంత కాలంగా తేజ తన సినిమాలతో ఆకట్టుకోలేకపోతున్నారు. గ్యాప్ తీసుకుని... సాయి రామ్ శంకర్ హీరోగా తేజ దర్సకత్వంలో రూపొందిన సినిమా '1000 అబద్దాలు'. ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను జారీచేయడం జరిగింది. సెన్సార్ వారు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయమన్నారు. ఈ సినిమాలో సాయి సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాని చిత్రం మువిస్ బ్యానర్ పై పాలడుగు సునీత నిర్మించారు.


తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

1000 అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది. ఫుల్ కామెడీ ప్యాక్ సినిమా ఇది. ముఖ్యంగా టవర్‌స్టార్‌గా నాగబాబు పాత్ర ఈ చిత్రానికి హైలైట్'' అని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ని అభిమానులు పవర్‌స్టార్‌ అని పిలుచుకోవడం విన్నాం. ఇక్కడ మాత్రం టవర్‌స్టార్‌ ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఇతగాడు ఎవరు? పవర్‌స్టార్‌తో సంబంధమేమైనా ఉందా? ఆ విషయం తెలియాలంటే '1000 అబద్ధాలు' చూడాల్సిందే అంటున్నారు.

నటీనటులు: సాయి రామ్ శంకర్, ఎస్తర్ , నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు
మాటలు: మరుధూరి రాజా,
సంగీతం: రమణగోగుల,
కెమెరా: రసూల్ ఎల్లోర్,
కళ: నరసింహవర్మ,
ఎడిటింగ్: శంకర్,
పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్.
సమర్పణ: చిత్రం మూవీస్,
నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.
నిర్మాత : పాలడుగు సునీత

English summary
Teja who changed the fate of small films with films like CHITRAM, NUVVU NENU and JAYAM has slowly lost his touch and gradually faded out with no offers on hand. His last release NEEKU NAAKU DASH DASH too was a big disaster. Today he’s coming up with 1000 ABADDALU as Sai Ram Shankar as the hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu