»   » ట్విస్టెడ్ లవ్ స్టోరీ ('నీకు నాకు డాష్‌ డాష్‌'ప్రివ్యూ)

ట్విస్టెడ్ లవ్ స్టోరీ ('నీకు నాకు డాష్‌ డాష్‌'ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్రం,నువ్వు నేను,జయం వంటి ప్రేమ కథలతో యువతలో తన కంటూ క్రేజ్ తెచ్చుకున్న తేజ తాజాగా మరో ప్రేమ కథా చిత్రంతో ముందుకొస్తున్నారు. కేక డిజాస్టర్ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని మరీ 'నీకు నాకు డాష్‌ డాష్‌'అనే లవ్ స్టోరీ ని రెడీ చేసారు. ఎప్పటిలాగే అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఈ చిత్రం తప్పకుండా ఓ మంచి ఫీల్ గుడ్ చిత్రం అవుతుందని తేజ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


శివ (పిన్స్‌), గాయత్రి (నందిత) ఇద్దరూ నకిలీ మద్యం తయారు చేసే ముఠా దగ్గర పని చేస్తుంటారు. గాయత్రికి శివ అంటే ఇష్టం. అతని అమాయకత్వానికీ, మంచితనానికీ మురిసిపోతుంది. డాష్‌... డాష్‌ అంటూ ఏడిపిస్తుంది. వీరిద్దరి బంధం ప్రేమగా రూపాంతరం చెందే సమయానికి కథలోకి బాపినీడు (చౌదరి), చిట్టితల్లి (తీర్థ) పాత్రలు ప్రవేశిస్తాయి. ఈ ప్రేమికులు చేసిన డాష్‌ పని... వారికి ఎన్ని సమస్యలు తీసుకొచ్చింది? అనేదే కథ. శివ, గాయత్రిల ప్రేమ కథ ఏమైంది? చిట్టితల్లి ఎవరు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవల్సిందే.

ఇక ఈ చిత్రం గురించి తేజ మాట్లాడుతూ .... 'నీకు నాకు డాష్ డాష్' అంటే రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇందులో రక్తపాతం, బూతులు ఉండవు. 'డాష్' అనేది హీరోయిన్ ఊతపదం. ఇది లవ్‌స్టోరీ మేళవించిన థ్రిల్లర్. శుభంకార్డు పడే రెండు నిమిషాల ముందు కూడా ఓ మలుపు వస్తుంది. ఏమాత్రం ఊహించని ఆ మలుపుకు ప్రేక్షకులు థ్రిల్‌కు గురవుతారు.
నాలుగేళ్ల విరామం తరవాత తీసిన సినిమా ఇది. కథ, కథనాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. శుభం కార్డు వేసే ముందు కూడా ఓ మలుపు ఉంటుంది. అది ఎవరూ వూహించరు. పాటలకు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ చిత్రం ప్రేమకథ అని చెప్పలేను... ఆ స్థాయిని దాటిన భావోద్వేగాలు ఉంటాయి.

టెక్నికల్‌గా చూసుకుంటే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడం ప్రథమం.


సంస్థ: భవ్య క్రియేషన్స్‌
నటీనటులు: ప్రిన్స్‌, నందిత, చౌదరి, పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, బెనర్జీ, తనికెళ్ల భరణి, వేణు, సుమన్‌శెట్టి, ఉత్తేజ్‌ తదితరులు.
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్‌.
దర్శకత్వం: తేజ
విడుదల: శుక్రవారం.

English summary
Teja's Neeku Naaku Dash Dash is all set to hit the screens today. Teja is back with this movie after a long Hiatus of four years. He had given huge blockbusters at the start of his directing career like Jayam and Nuva Nenna. The music of Neeku Naaku Dash Dash composed by Yashwanth Nag.
Please Wait while comments are loading...