twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టే డేట్స్ ఇచ్చాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌బాబుని ఇప్పుడు 'నిజం' చెయ్యమంటే చెయ్యడు. ఆ సినిమాకి అతన్ని అడిగినప్పుడు 'బాబీ' అనే అట్టర్ ఫ్లాప్ సినిమా చేశాడు. నేను తీసిన 'జయం' సక్సెస్ అయ్యింది కాబట్టి 'నిజం' చేయడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఎందుకు చేస్తాడు? అంటూ చెప్పుకొచ్చారు దర్శక,నిర్మాత తేజ. సాధారణంగా డెరైక్టర్స్‌కి ఉండే... బాలకృష్ణతోనో పవన్‌కళ్యాణ్‌తోనో సినిమా చేయాలనే లక్ష్యాలు నాకు లేవు. కానీ ఒక్క లక్ష్యం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా తప్పుదోవలో వెళుతోంది. అది దర్శక, నిర్మాతలకు, హీరోలకు.. అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నదే ఆ లక్ష్యం అంటూ వివరించారు దర్శక,నిర్మాత తేజ. ఆయన తాజా చిత్రం 'వెయ్యి అబద్ధాలు'త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే....డిఫరెంట్ టైపాఫ్ సినిమాలు తీయాలని ఉంది. ఇండియాలో కమర్షియల్, ఆర్ట్.. ఇలా రెండు రకాల సినిమాలున్నాయి. ఆర్ట్ అంటే మరీ ఆథెంటిక్‌గా ఉంటాయి. బి. నరసింగరావుగారు తీసిన 'దాసి'లాంటివి అన్నమాట. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు జీవితాలను చూస్తున్నట్లనిపిస్తుంది. 'అత్తారింటికి దారేది', 'ఎవడు'.. ఇలాంటివన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్స్. ఇలా కాకుండా ఆథెంటిక్ సినిమాలో కమర్షియల్ వేల్యూస్ ఉండేలా, కమర్షియల్ వేల్యూస్ ఉన్న చిత్రం ఆథెంటిక్‌గా ఉండేలాగ. ఆ రెండిటికీ మధ్య ఉన్న గోడ తీసేయాలన్నది నా ఆశయం. నేను తీసిన 'చిత్రం'ని తీసుకుంటే ... అటు కమర్షియల్‌గానూ ఉంటుంది. అలాగే ఆర్టిస్టిక్‌గా కూడా ఉంటుంది. దాన్ని ఒప్పుకోవడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ, ఆడియన్స్ అన్ని రకాల సినిమాలు చూడ్డానికి రెడీగా ఉన్నారు. మేమే తియ్యడంలేదు అని చెప్పుకొచ్చారు.

    మహేష్‌బాబు తర్వాత వేరే స్టార్ హీరోస్‌తో ఎందుకు సినిమాలు చేయలేదో కారణం చెప్తూ.... తెలుగు హీరోలందరూ ఓ ఫిక్స్‌డ్ ఫార్మట్‌లో ఉన్నారు. స్లో మోషన్‌లో నడవాలి, ఆరు పాటలు, ఫైట్లు ఉండాలి. మిగిలినదాంట్లో కథ చెప్పాలి. ఇప్పుడు 'స్వాతిముత్యం'లాంటి సినిమాని నేను తెలుగులో తీయాలనుకున్నాననుకోండి.. ఒక్క హీరో పేరు చెప్పండి. ఏం మన హీరోల్లో యాక్ట్ చేసే కెపాసిటీ లేదా? అంటే... మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లాంటివాళ్లు అద్భుతంగా చేయగలుగుతారు. కానీ చెయ్యరు. కమర్షియల్ గిరి నుంచి బయటికి రావడానికి వాళ్లు ఇష్టపడటంలేదు. అందుకే నేను పెద్ద స్టార్స్‌తో చెయ్యను అని తెగేసి చెప్పారు.

    ఇక జనాలకు నిజం చెబితే నచ్చడంలేదు. 'నిజం' సినిమాలో మీరు నిజం అనుకునేవన్నీ నిజాలు కాదు... అంతా అబద్ధమే అని చెప్పాను. అందుకే 'ఇట్స్ ఎ లై' అన్నాను. ఇప్పుడు 'అబద్ధం'లోనూ అస్సలు నిజం లేదు అంటున్నా. అయితే, ఏకంగా టైటిలే పెట్టి సినిమా తీశా. వెయ్యి అబద్ధాలాడి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే ఈ 'వెయ్యి అబద్ధాలు' చిత్రకథ అని అన్నారు.

    English summary
    Teja Says...." During that time Mahesh's 'Bobby' did not do well, so I started the film 'Nijam' with Mahesh Babu. But after the release of 'Okkadu' he became superstar. His image sky rocketed and in 'Nijam' fans couldn't digest their hero to be following his mother's words and doing murders. They expected him to do murders on his own. The film did not do well. What we can do?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X