»   » అడల్ట్ చిత్రంలో నటిస్తున్న తేజస్వి

అడల్ట్ చిత్రంలో నటిస్తున్న తేజస్వి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత చెల్లెలుగా నటించిన నటి తేజస్వి ప్రస్తుతం... హంటర్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న 'సోగ్గాడు...బాబు చాలా బిజీ' అనే అడల్ట్ చిత్రంలో నటిస్తోంది. కాలేజ్ గోయింగ్ గర్ల్ గా నటిస్తున్న ఈ భామ అవసరాల శ్రీనివాస్ సరసన రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటిస్తోందట. 'సోగ్గాడు' చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, హాట్ యాంకర్ శ్రీముఖి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తేజస్వి కాలేజ్ గర్ల్ గా, అవసరాల గర్ల్ ఫ్రెండుగా నటిస్తోంది. అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలకు కొదవలేదు. పైగా అవసరాల, తేజస్వి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఉన్నాయట. ఈ సన్నివేశాల్లో తేజస్వి జీవించి కుర్రకారుకు మతిపోయేలా చేస్తుందట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తేజస్వి కెరీర్ గ్రాఫ్ మరోలా ఉంటుందటున్నారు చిత్ర యూనిట్.

English summary
‘Ice Cream’ girl Tejaswini Madivada is playing one of the three female leads in this adult comedy film 'Soggadu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu