»   » తెలంగాణ సినీరంగానికి కేసీఆర్ చేయూత

తెలంగాణ సినీరంగానికి కేసీఆర్ చేయూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ సినీ రంగానికి చేయూత నిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలంగాణ మంత్రి జోగు రామనప్న అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ సినీ కళాకారుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా అసోసియేషన్‌ను ఏర్పాటుచేయటం అభినందనీయం. ఈ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన తెలంగాణ కళాకారులకు ఓ అస్తిత్వం ఏర్పడుతుంది. పని దొరికేందుకు అవకాశం కలుగుతుంది అన్నారు. కుల, మత, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు..

సానా యాదిరెడ్డి

సానా యాదిరెడ్డి


నిర్మాతల మండలి అధ్యక్షుడు సానాయాదిరెడ్డి మాట్లాడుతూ కాంతారావు, ప్రభాకర్‌రెడ్డిల కాలం నుంచి తెలంగాణ కళాకారులపై వివక్ష కొనసాగుతోంది. తెలంగాణ కళాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తరపున ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలన్నారు.

కలుపుకుపోవడం లేదు

కలుపుకుపోవడం లేదు


తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగకుమార్ మాట్లాడుతూ తెలుగు సినిమా అంటే ఆంధ్ర సినిమా అనే భావన నేడు చిత్ర పరిశ్రమలో నెలకొంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత కళాకారులను మనస్ఫూర్తిగా కలుపుకుపోకుండా ఇంకా వివక్షను చూపుతున్నారు.

విభజన జరుగాలి

విభజన జరుగాలి


ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విభజన జరిగితే తెలంగాణ సినిమా రంగం అభివృద్ధి చెందేందుకు ఆస్కారముంది అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

ఆవేదన

ఆవేదన


తెలంగాణ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న ముందు వెల్లబోసుకున్నారు.

English summary
Telangana Cinema Artists Association Office Inaugurated by Telangana Forest & Environment Minister Jogu Ramanna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu