»   » మధుర శ్రీధర్ దర్శకత్వంలో..... కేసీఆర్ జీవితంపై సినిమా!

మధుర శ్రీధర్ దర్శకత్వంలో..... కేసీఆర్ జీవితంపై సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) జీవితం సినిమాగా రాబోతోంది. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను నిర్మాత రాజ్ కందుకూరి తన ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మేరకు మధుర శ్రీధర్ రెడ్డి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

  Telangana CM KCR’s life as a movie

  ప్రెస్ నోట్ వివరాలు....

  ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి... వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు.

  ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం. కేసీయార్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టింది...

  Telangana CM KCR’s life as a movie

  1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, వై. ఎస్. ఆర్, సోనియా గాంధి, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను.

  మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను. 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావదినోత్సవాన షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

  -మధుర శ్రీధర్ రెడ్డి

  English summary
  "I discovered that the kind of challenges KCR faced were on par with what Mahatma Gandhi, Nelson Mandela and Martin Luther King faced during their movements. As a filmmaker, I decided to bring this history onscreen. The shooting will commence on June 2nd, 2017 the Telangana formation day and the film will release on February 17th, 2018 on the eve of KCR’s birthday. The film will be produced by Raj Kandukuri on his home banner Dharmapada Creations." Madhura Sreedhar Reddy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more