twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ మార్చ్‌కు సినీ హీరోలు మద్దతివ్వాలి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు సినీ హీరోలంతా మద్దతు ఇవ్వాలని దర్శకుడు ఎన్. శంకర్ కోరారు. సినీ కళాకారులంతా ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజల మనో భావాలను అర్థం చేసుకుని తెలంగాణ మార్చ్ లో పాల్గొనాలని ఆయన కోరారు. మరో వైపు కవాతుకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మద్దతు ప్రకటించింది. రేపు సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు బందు పాటిస్తున్నట్లు ప్రకటించింది.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో ఈనెల 30 టిజేఏసీ ఆధ్వర్యంలో కవాతు కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను రోజు రోజుకు జాప్యం చేస్తుండటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వేడి రగిల్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇక్కడి కళాకారులకు న్యాయం జరుగుతుందని, ఇక్కడి దర్శక నిర్మాతలు సినిమాల రంగంలో నిలదొక్కుకోగలుతారని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సభ్యులు అటున్నారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణకు చెందిన వారు ప్రాంతీయ వివక్షకు గురయి సరిగా అవకాశాలు అందిపుచ్చుకోలేక పోతున్నారని, పరిశ్రమలో అగ్రనటులుగా ఎదిగిన వారిలో ఈప్రాంతం నుంచి చాలా తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకనే వెనకబడి పోయారని అంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేయడానికి అదే ప్రధాన కారణం అని స్పష్టం చేస్తున్నారు.

    English summary
    Telangana Film Chamber supporting to Telangana March. Chamber members will Participate in Telangana March on Sep 30 at Necklace Road.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X