For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తెలంగాణ ఆవిర్భావం: టాలీవుడ్‌కు ప్రభుత్వం అండ.. సినీ వర్గాలకు కేసీఆర్ భరోసా!

  By Rajababu
  |
  Telangana CM KCR Gets Praised By Tollywood Heroes

  తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రాంతం వారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రాంతం వారి వల్ల తెలంగాణ నష్టపోయిందని, ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి కారణం వారే అనే వాదన అన్ని వర్గాల నుంచి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్ర ప్రాంతం వారిలో అభద్రతాభావం ఏర్పడింది. ప్రధానంగా సినిమా పరిశ్రమ వర్గాల ఏర్పడిన భయాందోళనలను తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చర్యలు చేపట్టారు. సినీ పరిశ్రమలోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరై వారికి భరోసా కల్పించారు. అంతేకాకుండా పరిశ్రమలోని ప్రముఖులకు చేరువై అండగా నిలిచారు.

   ఎన్టీఆర్ అంటే అభిమానం

  ఎన్టీఆర్ అంటే అభిమానం

  నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ‘ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనను ఇష్టపడని కుటుంబం, తెలుగు వారు లేరు. నందమూరి కుటుంబం అంటే తెలుగు వారికి ఎంతో ప్రేమ. మద్రాసీలు అని పేరు పొగొట్టి తెలుగు వారు అని పేరు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు' అని కేసీఆర్ అనడంతో సినీ వర్గాల్లో జోష్ పెంచింది.

  ఎన్టీఆర్ గొప్ప తెలుగు బిడ్డ

  ఎన్టీఆర్ గొప్ప తెలుగు బిడ్డ

  ఎన్టీఆర్ అంటే ఓ తరం నటుడు కాదు. తెలుగు జాతికి లభించిన గొప్ప బిడ్డ. అలాగే గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో తన వందో చిత్రం తీయాలని బాలకృష్ణ తీసుకొన్న నిర్ణయం గొప్పది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆటను చూసే అవకాశం తనకు ఇవ్వండి. కుటుంబ సమేతంగా చిరంజీవి, వెంకటేష్‌తో కలిసి చూస్తాను అని సీఎం కేసీఆర్ అన్నారు.

  కృష్ణకు అభిమానిని

  కృష్ణకు అభిమానిని

  మరో కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణను సీఎం కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. నటశేఖర కృష్ణకు నేను అభిమానిని. ఆయన చిత్రాలంటే నాకు ఇష్టం. అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని సుమారు 15 సార్లు చూసి ఉంటాను. హాలీవుడ్ స్థాయిలో రాచకొండలో రూపొందించే ఫిలిం సిటీకి సంబంధించిన కమిటీలో సీనియర్ నటుడు కృష్ణ ఉండాలని కోరుకొంటున్నాను అని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఫిలిం సిటీని నిర్మిస్తే అది ప్రపంచంలోనే పెద్దదిగా ఉంటుంది. కొత్తగా నిర్మించే ఫిలిం సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి అని కృష్ణ ఆకాంక్షించారు.

  రాజమౌళి ట్రెండ్ సెట్టర్

  రాజమౌళి ట్రెండ్ సెట్టర్

  సినీ దిగ్గజం, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు అవార్డును దర్శక ధీరుడు రాజమౌళికి ప్రదానం చేసే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డును ఎస్ఎస్ రాజమౌళి అందుకోవడం ఓ ఘనత.
  రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం హిందీ, తెలుగు భాషల్లో చూశాను. ఆ చిత్రం అద్భుతమైన కళాఖండం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగులో కూడా ఎంత బడ్జెట్‌తోనైనా సినిమాను చేయవచ్చు అని చెప్పిన చిత్రం బాహుబలి. బాహుబలితో రాజమౌళి ట్రెండ్ సెట్టర్‌గా మారారు అని కేసీఆర్ అన్నారు.

  డ్రగ్స్ కేసులో సినీ నటులు

  డ్రగ్స్ కేసులో సినీ నటులు

  అలాగే డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు ఇరుకొన్నప్పుడు సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో సినీ నటులకు, వర్గాలకు ఎలాంటి వేధింపులు ఉండవు. సినీ పరిశ్రమ అభివృద్దికి, సినీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అని కేసీఆర్ అన్నారు.

  English summary
  Telangana CM K Chandra Sekhar Rao responded on film actors drug issue. At that time, KCR reiterated that the state government didn't target the Telugu film industry and the focus mainly is on to curb smuggling of banned drugs in Telangana. Many occassions, KCR assured support to Film Industry.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more