twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ రెడ్డి నుంచి సూపర్ స్టార్ వరకు.. టాలీవుడ్ పునాదులు కదలకుండా, అపర చాణిక్యుడు కేటీఆర్!

    |

    Recommended Video

    KTR Plays Key Role In Film Industry

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే రాజకీయ పరమైన చర్చ సహజంగానే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరం అని చెప్పడంలో సందేహం లేదు. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ భాగాన్ని విస్మరించలేం. ఇటీవల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమ తన పరిధిని పెంచుకుంటూ భారీ స్థాయిలో చిత్రాలని నిర్మిస్తోంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రకు తరలి వెళుతుందా అనే చర్చ కూడా జరిగింది. అలాంటి చర్చ పెరిగి పెద్దది కాకుండా తెలంగాణ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో మంత్రి కేటీఆర్ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు.

    యువ నాయకుడిగా

    యువ నాయకుడిగా

    చిత్ర పరిశ్రమలో ఎక్కువగా యంగ్ స్టార్స్ ఉంటారు. రాజకీయాల్లో కేటీఆర్ యువనాయకుడే. దీనితో ఆయన స్టార్ హీరోలందరితో సన్నిహితంగా మెలుగుతున్నారు. వాస్తవానికి చిత్ర పరిశ్రమలో కూడా పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ సినిమాకు రాజకీయంతో సంబంధం లేదు అని చెబుతూ కేటీఆర్ అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నారు.

    పెళ్లి చూపులు వంటి చిన్న సినిమా కోసం

    పెళ్లి చూపులు వంటి చిన్న సినిమా కోసం

    ప్రభుత్వ కార్యక్రమాలకు సింహభాగం సమయాన్ని వెచ్చిస్తూనే సినిమా ఆహ్వానాలని కూడా కేటీఆర్ పరిశీలిస్తున్నారు. 2016 లో పెళ్లి చూపులు చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించారు.

    ధృవ ప్రీరిలీజ్ ఈవెంట్

    ధృవ ప్రీరిలీజ్ ఈవెంట్

    రాంచరణ్ నటించిన ధృవ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ వేడుకలో కేటీఆర్ అందరిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసించారు. 2009 లో తాను తొలిసారి ఎమ్మెల్యే గా ఎన్నికైన తరువాత అసెంబ్లీలో చిరంజీవిని తొలిసారి కలిశానని కేటీఆర్ ఆ వేడుకలో గుర్తుచేసుకున్నారు.

    సామాజిక కార్యక్రమాల్లో

    సామాజిక కార్యక్రమాల్లో

    చిత్ర పరిశ్రమని సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడంలో కూడా కేటీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సమంతని తెలంగాణ ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా సినీప్రముఖులతో కలసి కేటీఆర్ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    సీఎం భరత్ కోసం

    సీఎం భరత్ కోసం

    ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విజయం సాధించిన తరువాత చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మహేష్, కొరటాల శివతో కేటీఆర్ ముచ్చటించారు.

     అమరావతి వేదికగా

    అమరావతి వేదికగా

    ఇటీవల కాలంలో విజయవాడ వేదికగా కూడా కొన్ని సినీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రి ప్రభుత్వం వీలు చిక్కినప్పుడల్లా తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రకు రావాలి, రెండు రాష్ట్రల్లో సినిమాలు నిర్మించాలి అనే పిలుపు ఇస్తోంది.

    ఆ ఆలోచన కూడా రాకుండా

    ఆ ఆలోచన కూడా రాకుండా

    తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు సామజిక వర్గాలు బలంగా ఉన్నాయనే మాట వాస్తవం. కేటీఆర్ అందరిని బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అందరిది అనే అభిప్రాయాన్ని బలంగా తీసుకుని వెళ్లారు. హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ తరలి వెళ్ళిపోతుందనే ఆలోచన కూడా లేకుండా చేయడంలో విజయవంతం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటి.

    డ్రగ్స్ వివాదం మినహా

    డ్రగ్స్ వివాదం మినహా

    ఆ మద్యన సంచలనం సృష్టించిన డ్రగ్స్ వివాదం మినహా సినీప్రముఖులు ఇబ్బంది కలిగించే అంశాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగలేదు. దానిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సున్నితంగా పరిష్కరించారు. చిత్ర పరిశ్రమకు అనుకూలంగానే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందనేది వాస్తవం.

    మంచి జరిగినా, చెడు జరిగినా

    మంచి జరిగినా, చెడు జరిగినా

    తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిగా నియమించింది. చిత్ర పరిశ్రమలో జరిగే మంచి చెడులకు ఆయన వేగంగా స్పందిస్తున్నారు.

    English summary
    Telangana Government balancing the two major communities in the film industry. KTR plays key role in it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X