twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. చిరంజీవి, నాగార్జున, రాంచరణ్ ప్రశంసల వర్షం

    |

    లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన టాలీవుడ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

    సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ రాయితీల వర్షం

    సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ రాయితీల వర్షం

    కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీఎం ప్రకటనపై టాలీవుడ్ వర్గాలు సోషల్ మీడియాలో స్పందించి సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.

    థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

    థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

    సీఎం ప్రకటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్, థియేటర్లకు విద్యుత్ ఛార్జీల రద్దు, రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శనలు పెంపుకు అనుమతి, అలాగే మెట్రోపాలిటన్ సిటీలో ఉండే విధంగా టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

    అక్కినేని నాగార్జున ధన్యవాదాలు

    అక్కినేని నాగార్జున ధన్యవాదాలు

    టాలీవుడ్‌ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్. కోవిడ్ సమయంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఊరట కలిగించే చర్యలను తీసుకొన్న ముఖ్యమంత్రి నిజంగా అభినందనీయుడు అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు.

    Recommended Video

    Chiranjeevi And Other Tollywood Big Shots Meeting With Talasani Srinivas Yadav
    రాంచరణ్ ట్వీట్

    రాంచరణ్ ట్వీట్


    చిత్ర పరిశ్రమను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకొన్న నిర్ణయం అభినందనీయం. ప్రభుత్వం నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకొంటుంది అంటూ రాంచరణ్ ట్వీట్ చేశాడు.

    సాయిధరమ్ తేజ్ ట్వీట్

    సాయిధరమ్ తేజ్ ట్వీట్

    చిరంజీవి ట్వీట్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం, అధికారులు తీసుకొన్న నిర్ణయాలు సినీ పరిశ్రమను తిరిగి నిలబెట్టేలా ఉన్నాయి. మరింత ఉత్సాహంతో టాలీవుడ్ పరుగులు పెట్టడం ఖాయం. త్వరలోనే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం గ్యారెంటి. పెదాలపై చిరునవ్వులు చిగురించడం ఖాయం అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Telangana Government helping hand for Tollywood which in troubled in Covid 19 lockdown. In this occassion, Chiranjeevi, Nagarjuna praises KCR. Chiranjeevi tweeted that Heartfelt Thanks to Hon'ble CM Shri. #KCR garu for the relief measures to the film industry. Trust that these compassionate measures surely will go a long way in reviving the industry badly hit by the pandemic and put it back on the path to progress. #TelanganaCMO
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X