twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామెన్ గంగతో రాంబాబు' రీళ్లు ఎత్తుకెళ్లిన తెలంగాణా వాదులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' నిన్న(గురువారం) భారీ ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తెలంగాణా ఉద్యమంపై వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయని తెలంగాణా వాదులు భగ్గుమన్నారు. హైదరాబాద్ ఆరాధన ధియోటర్ లో ప్రింట్స్ ని ఓయూ విద్యార్దులు ఎత్తుకెళ్లారు. ఈ రీళ్లను తగలపెడతామని అన్నారు. అలాగే సినిమాలో అభ్యంతరకమైన సన్నివేశాలు,డైలాగులు తొలిగించకపోతే తెలంగాణాలో అన్ని చోట్లా అడ్డుకుంటామని హెచ్చరించారు. వరంగల్, హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని తెలంగాణా వాదులు అడ్డుకున్నారు.

    ఓయూ జెఎసి నేత పిడమర్తి రవి మాట్లాడుతూ...వెంటనే తెలంగాణా ఉద్యమాన్ని కించపరుస్తూ చేసిన డైలాగులు తొలిగించాలని డిమాండ్ చేసారు. గతంలోనూ ఆంధ్రావాలా సమయంలోనూ పూరీ జగన్నాధ్ ఇలాగే తెలంగాణాపై విద్వేషాన్ని వెల్లగక్కారు అన్నారు. ఈ డైలాగులను పవన్ కళ్యాణ్ ఎలా డబ్బింగ్ చెప్పారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను, ఆయన కుమారుడిని దుష్టపాత్రల్లో చూపించి తెలంగాణ ఉద్యమాన్ని టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు.

    తెలుగుతల్లి పార్టీని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన రాజకీయ పార్టీగా, జవహర్ నాయుడిని ఆ పార్టీ నేతగా తీసుకోవడానికి వీలుగా సినిమాలో సంభాషణలను, ఇతివృత్తాన్ని ప్రదర్సించారు. రానాబాబు (ప్రకాష్ రాజ్) తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అన్వయిస్తూ కథను నడిపించాడు. రానాబాబు తన రాజకీయ ప్రస్థానం కోసం తెలుగుతల్లి ఉద్యమ పార్టీని స్థాపిస్తాడు. తన రాష్ట్రంలో తెలుగు ప్రజలు తప్ప మరాఠీ, బెంగాలీ, మలయాళీలు ఎవరూ ఉండకూడదని, వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను బహిష్కరించాలని ప్రసంగాలు చేస్తుంటాడతను.

    తెలంగాణ ఉద్యమాన్ని నేరుగా ప్రస్తావించే సాహసం చేయలేక తెలుగు తల్లి పారటీ, తెలుగు ఉద్యమం అంటూ సృష్టించారని అంటున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి హీరో రాంబాబు (పవన్ కళ్యాణ్) ప్రశ్నిస్తూ ఇలా డైలాగులు చెప్పించారు - 'పక్క రాష్టాల తల్లులంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కు ఎక్కడి', 'నిన్ను, నీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి తీసుకొచ్చి బట్టలూడదీసి కొడితే ఎలా ఉంటుందో రాష్ట్రం అలా ఉందిరా'. ఈ డైలాగులు తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మేవేనని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

    కొసమెరుపు ఏమిటంటే - వీర తెలంగాణ, పోరు తెలంగాణ చిత్రాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని వెండితెరపై చూపించిన దర్శకుడు ఆర్ నారాయణమూర్తికి ఈ సినిమాను అంకితం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్న నారాయణమూర్తికి సినిమాను అంకితం ఇవ్వడం ద్వారా తాను సినిమాలో ఉద్దేశించింది తెలంగాణ ఉద్యమాన్ని అని పూరీ జగన్నాథ్ చాటుకున్నారని అంటున్నారు.

    English summary
    Ou Jac Students angry on Camera Man Gangato Rambabu film. dircetor Puri Jagannath has exhibited his anti Telangana stand in Pawan Kalyan's Cameraman Gangatho Rambabu film. Craeting Telugu Talli party he criticised Telangana movement, it is said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X