»   » ఉద్యమాలతో ఈ 10 సినిమాలకు తిప్పలే! (ఫోటో ఫీచర్)

ఉద్యమాలతో ఈ 10 సినిమాలకు తిప్పలే! (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత మొదలైన సమక్యాంధ్ర ఉద్యమం....మరో వైపు తెలంగాణ ఉద్యమం కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని ఒక సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలన్నీ విడుదల ఆగిపోయాయి. అయితే పెద్ద సినిమాలు ఆగి పోవడం చిన్న సినిమాలకు మాత్రం కలిసొచ్చింది.

తెలుగు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ నటించిన 'అత్తారింటికి దారేది', 'ఎవడు' చిత్రాల విడుదల ఆగిపోయింది. ఈ చిత్రాలు ఇప్పటికే విడుదలయి ఉంటే స్వాతంత్ర దినోత్సవం, రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి లాంటి సెలవు దినాలను కలుపుకుని భారీ వసూళ్లు సాధించేవి. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగి ఉండేది.

ఈ రెండు చిత్రాలు ఆగిపోవడం, ఆలస్యంగా విడుదలవ్వడం లాంటి కారణాల వల్ల వీటి వెనక వచ్చే మరిన్ని పెద్ద సినిమాల విడుదల కూడా ఆలస్యం కానుంది. దీంతో పరిశ్రమకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని సినిమా ట్రేడింగ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

మరో వైపు ఉస్మానియా జేఏసీ జూ ఎన్టీఆర్ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వమని హెచ్చరికలు జారీ చేసారు. దీంతో జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదల అయోమయంలో పడింది. గతంలో తెలంగాణ ఉద్యమకారులతో పెట్టుకున్న సినిమాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 6న విడుదలవుతున్న రామ్ చరణ్ 'తుఫాన్' చిత్రానికి కూడా తిప్పలు తప్పేలా లేవు. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే హైదరాబాద్‌లో సమైక్య, తెలంగాణ ఉద్యమ కారులు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలో 'తుఫాన్' చిత్ర కలెక్షన్లపై పడుతుందని అంటున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ హీరోల సినిమాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు ఇప్పటికే హెచ్చరించారు కాబట్టి సీమాంధ్ర ప్రాంతంలోనూ ఈ చిత్రానికి తిప్పలు తప్పేలా లేవు.

ఎవడు

ఎవడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 35 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం జులై 31నే విడుదల అవ్వాల్సి ఉండగా....రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత ఏర్పడ్డ ఆందోళనకర పరిస్థితులు, అడ్డుకుంటామని సమైక్యవాదుల హెచ్చరికల నేపథ్యంలో సినిమాను వాయిదా వేసారు. ఈచిత్రం అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 40 కోట్ల పైచిలుకు వ్యయంతో ఈచిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 7న సినిమా విడుదలవ్వాల్సి ఉండగా సమక్యాంధ్ర ఉద్యమకారుల హెచ్చరికల కారణంగా సినిమా విడుదల నిలిపివేసారు

భాయ్

భాయ్

అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘భాయ్'. ఈ చిత్రం ఆగస్టు చివరి వారంలో విడుదలవ్వాల్సి ఉండగా....రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా వేసారు.

మసాలా

మసాలా

వెంకటేష్, రామ్ హీరోలుగా హిందీ మూవీ ‘బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘మసాలా'. ఈచిత్రం ఆగస్టు చివరి వారంలో విడుదలవ్వాల్సి ఉండగా...వీటికంటే ముందు విడుదల కావాల్సిన సినిమాల విడుదల ఆగిపోవడంతో ఈ చిత్రం విడుదల డేట్స్ అయోమయంలో పడ్డాయి.

తుఫాన్

తుఫాన్

సెప్టెంబర్ 6న విడుదలవుతున్న రామ్ చరణ్ ‘తుఫాన్' చిత్రానికి కూడా తిప్పలు తప్పేలా లేవు. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే హైదరాబాద్‌లో సమైక్య, తెలంగాణ ఉద్యమ కారులు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలో ‘తుఫాన్' చిత్ర కలెక్షన్లపై పడుతుందని అంటున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ హీరోల సినిమాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు ఇప్పటికే హెచ్చరించారు కాబట్టి సీమాంధ్ర ప్రాంతంలోనూ ఈ చిత్రానికి తిప్పలు తప్పేలా లేవు.

రామయ్యా వస్తావయ్యా

రామయ్యా వస్తావయ్యా

ఉస్మానియా జేఏసీ జూ ఎన్టీఆర్ సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వమని హెచ్చరికలు జారీ చేసారు. దీంతో జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదల అయోమయంలో పడింది. జూ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలంగాణ వాదులకు ఆగ్రహం తెప్పించింది.

పైసా

పైసా

నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పైసా'. ఈచిత్రం సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యమాల కారణంగా ఈచిత్రం కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అంటున్నారు.

పోటుగాడు

పోటుగాడు

మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న ‘పోటుగాడు' చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యమాల కారణంగా సినిమా నష్టపోతుందనే ఆందోలనలో ఉన్నారు నిర్మాతలు.

వర్ణ

వర్ణ

ఆర్య-అనుష్క జంటగా నటించిన తమిళ చిత్రం ఇరండమ్ ఉలగమ్ తెలుగులో ‘వర్ణ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజు సమైక్య, తెలంగాణ ఉద్యమ కారులు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సినిమాపై ప్రభావం పడుతుందని అంటున్నారు.

బిర్యానీ

బిర్యానీ

కార్తి, హన్సిక నటించిన ‘బిర్యానీ' చిత్రం కూడా సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల అవుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

English summary
The division of Andhra Pradesh into Seemandhra and Telangana has caused a big upheaval in all spheres of life in the state. Telugu film industry is biggest victim of this development.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu