twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #Save Cinema #Save Theatres సినీ పరిశ్రమను రక్షించండి.. టీఎస్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవేదన

    |

    తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి పలు డిమాండ్ చేస్తూ ఓ వినతి పత్రాన్ని విడుదల చేసింది. #Save Cinema #Save Theatres అనే నినాదంతో ఓ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్‌కు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో పలు విషయాలను ప్రస్తావిస్తూ..

    తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 75ను పున: పరిశీలించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. అలాగే థియేటర్లలో పార్కింగ్ చార్జీలను వసూలు చేసే వెసలుబాటును కల్పించాలని సూచించింది. ప్రేక్షకుల నుంచి తక్కువ మొత్తంలో పార్కింగ్ ఛార్జిలను వసూలు చేసే విధంగా చూడాలని, అలాంటి వెసులుబాటు ఉంటే థియేటర్ యాజమాన్యాలకు సహాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. పార్కింగ్ ఛార్జీల వసూలు ఏన్నో దశాబ్దాల కాలంగా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు.

    Telangana State Film Chamber demands Save Cinema and Save Theatres

    అలాగే లాక్‌డౌన్ కాలంలో సినిమా హాళ్లు మూతపడిన నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాల నుంచి కనీస ఛార్జీలను ఎలక్ట్రిసిటీ బోర్డు వసూలు చేసింది. దాంతో థియేటర్ యాజమాన్యాలు ఆర్థికంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి థియేటర్ యాజమాన్యాలకు, ఎగ్జిబిటర్లకు కనీస చార్జీలను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది.

    అంతేకాకుండా లాక్‌డౌన్ కాలంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన థియేటర్ యాజమాన్యాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పన్ను చెల్లింపు అత్యంత భారంగా మారింది. కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేసింది.

    కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వస్తూ సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది.

    English summary
    Telangana State Film Chamber demands Save Cinema and Save Theatres. The request waver of Electricity charges, Parking Charges in Cinema Theatres and reduction of GST from Theatres owners.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X