»   »  హీరో రాజా వివాహం చేసుకోబోయేది ఈమెనే(ఫొటో)

హీరో రాజా వివాహం చేసుకోబోయేది ఈమెనే(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆనంద్ ఫేమ్ రాజా త్వరలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నైకి చెందిన అమ్రితను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. అమ్రిత ఓ లీడింగ్ బిజినెస్ మ్యాన్ కుమార్తె. చెన్నై లో వివాహం, హైదరాబాద్ లో రిసెప్షన్. ప్రక్కన చూస్తున్న ఫోటోలో మీరు చూస్తున్నది రాజా చేసుకోబోయే ఆమెనే.

హీరో రాజా మాట్లాడుతూ... ''ఇది పెద్దల కుదిర్చిన సంబంధమే. మార్చి మొదటి వారంలో నిశ్చితార్థం. ఈ శుభకార్యం చెన్నైలో జరుగుతుంది. ఈ నెల 25న పెళ్లి చేసుకోబోతున్నా. అమృత విన్సెంట్‌తో చెన్నైలో మా వివాహ వేడుక జరుగుతుంది. 30న హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. '' అన్నారు. ప్రస్తుతం 'పార్కింగ్‌' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతోంది.

Telugu actor Raja to get married to Amrita

శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో రాజా. ఆ చిత్రం తర్వాత దాదాపు ఓ పది చిత్రాల్లో నటించినా హిట్ రాలేదు.దాంతో వరస ప్లాపుల హీరోకు తెలుగు సినిమా బ్రేక్ ఇచ్చి ఇంట్లో కూర్చో పెట్టింది. దాంతో మరీ ఖాళీ పడిపోయామని గమనించిన రాజా ఆ మధ్య తన దృష్టిని తెలివిగా టీవీ యాంకరింగ్ వైపు తిప్పారు. అదీ కలిసి రాలేదు.

ఇక రాజా ఖాళీ పడటానికి కారణాలు అనేకం.ముఖ్యంగా సినిమాలు వరసగా ప్లాప్ అవటం కారణం. వీటితో పాటు సక్సెస్ రేటు లేకున్నా రెమ్యునేషన్ మాత్రం భారీగా అడగటం జరిగింది. మరో ప్రక్క శాటిలైట్ మార్కెట్ కూడా రాజా అస్సలు లేకుండా పోయింది. దాంతో రాజా అంటే ఏ దర్శకుడూ, నిర్మాత ధైర్యం చేయటం లేదు. పెళ్లితో చాలా మందికి దశ తిరుగుతుంది అంటారు. ఈ వివాహం తో అయినా రాజా కి కలిసి రావాలని కోరుకుందాం.

English summary
Raja would soon get married to Amrita, a Chennai based girl. Reports say that the wedding would be an arranged one and the girl is daughter of a businessman in Tamil Nadu. The engagement would place in early March and the marriage is expected to be in April.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu