twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీనటుడి హైలెవల్ ఫ్రాడ్ బట్టబయలు.. సంతకాలు చూపించి దోచేశాడు!

    |

    చాలా మంది సినీనటులు పలు నేరాలకు పాల్పడి కేసుల్లో చిక్కుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. బుల్లితెరపై, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసే నటుడు రామచంద్ర బాబు భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డాడు. దీనితో రామచంద్ర బాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ఏళ్ల తరబడి ఈ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రామచంద్ర బాబు మరోమారు అరెస్ట్ కాబడినట్లు తెలుస్తోంది.

     ఘరానా మోసం

    ఘరానా మోసం

    హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఖాదర్ బాషాతో పాటు మరికొందరికి 3 ఎకరాలకు పైగా స్థలం ఉంది. వారిని బురిడీ కొట్టించిన రామచంద్ర బాబు 20 లక్షలు ఇస్తానని నమ్మించి కొన్ని పాత్రలలో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించాడు. ఈ నకిలీ పత్రాలు ఉపయోగించి శ్రీనివాస్ అనే వ్యక్తిని మోసం చేసినట్లు తెలుస్తోంది.

    ఆ స్థలం నాదే అని నమ్మించి

    ఆ స్థలం నాదే అని నమ్మించి

    సంతోష్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి రామచంద్ర బాబు ఈ నకిలీ పత్రాలు చూపించాడు. ఆ స్థలం నాదే అని నమ్మించి అతడితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు 60 లక్షలు డబ్బు ఇస్తే స్థలంలో 25 శాతం వాటా ఇస్తానని నమ్మించాడు. దీనితో శ్రీనివాస్ అతడికి 60 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరికి కర్నూలుకు చెందిన ఓ రాజకీయనాయకుడు మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

    అసలు నిజం తెలుసుకుని

    అసలు నిజం తెలుసుకుని

    రామచంద్ర బాబు మరోమారు కూడా శ్రీనివాస్ వద్ద 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల తరువాత శ్రీనివాస్ కు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు ఆ స్థలం అతడిది కాదని తెలిసింది. తాను పూర్తిగా మోసపోయానని శ్రీనివాస్ కంగుతిన్నాడు.

    బెయిలుపై బయటకు

    బెయిలుపై బయటకు

    ఈ కేసు విషయంలో 2009లోనే రామచంద్ర బాబుపై కేసు నమోదైంది. ఆ సమయంలో తీసుకున్న బెయిలు గడువు పూర్తి కావడంతో అతడిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. చిన్న చిన్న వేషాలు వేసుకునే రామచంద్ర బాబు ఇలా భారీ చీటింగ్ కు పాల్పడి చిక్కులు కొనితెచ్చుకున్నాడు.

    English summary
    Telugu Actor RamaChandrababu Arrested for High Level froud. He Creates fake documents
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X