డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ మరో హీరో

ఆ మధ్య వచ్చిన 'జై బోలో తెలంగాణ' చిత్రంలో హీరోగా నటించిన సందీప్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సందీప్ మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే కారు సీజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మధ్య తరచూ టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు ఇలా తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అయినా సరే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. మధ్యం సేవించి కారు నడపటం వారికి మాత్రమేకాదు.....వారి వల్ల ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
నిబంధనలు ఉల్లంఘించిన ఇలాంటి వారిని కేవలం ఫైన్ వేసి వదిలేయటం కాకుండా.... ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా తప్పనిసరిగా జైలుకు పంపి కఠినంగా శిక్షించినపుడే మరోసారి ఇతరులెవరూ ఇలా తాగి డ్రైవింగ్ చేయడానికి సాహసించరని సాధారణ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











