Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాష్ట్ర విభజనపై తెలుగు సినీస్టార్స్ స్పందన (ఫోటోఫీచర్)
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ ప్రాంతంలో సంబరాలు జరుగుతుంటే, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం.
భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడబోతోంది. ఇంతకాలం రెండు ప్రాంతాల ప్రజలను తమ సినిమాలతో ఎంటర్టెన్ చేస్తూ వచ్చిన సినిమా తారలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమదైన రీతిలో స్పందించారు. తమ సినీ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రాంతం వారిని నొప్పించకుండా తమదైన రీతిలో స్పందించారు. కొందరు మాత్రం ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని సైలెంట్ అయిపోయారు.
టాలీవుడ్ స్టార్స్ అయిన నాగార్జున, కాజల్, సిద్ధార్థ, నాని, లక్ష్మి మంచు, నిఖిల్ తదితరులు రాష్ట్ర విభజనపై తమదైన రీతిలో స్పందించారు.....ఆ విశేషాలు స్లైడ్ షోలో

అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...మిశ్రమ భావోద్వేగాలతో రోజు ప్రారంభమైంది. కొంత మంది సంతోషంగా ఉన్నారు. కొంత మంది విషాదంలో ఉన్నారు. ఎన్నో ప్రశ్నలు....అంతా మంచి జరుగాలి' అంటూ ట్వీట్ చేసారు.

హీరో సిద్ధార్థ
హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ....‘తెలంగాణపై తుది నిర్ణయం జరిగిపోయింది. దయచేసి ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగవద్దని కోరుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు క్షేమంగా ఉండాలి' అని ట్వీట్ చేసారు.

. హీరో నాని
హీరో నాని తన ట్విట్టర్లో స్పందిస్తూ....‘మన ఇంటి మధ్యలో గోడ కడుతున్నారన్నమాట. సరే... ఇన్ని చూసాం, ఇది కూడా చూస్తూ కూర్చుందాము. స్వార్థం మంచికి చెడుకి తేడా తెలియకుండా చేస్తుంది. చెప్పే వయసు నాకు లేదు. అయినా చెబుతున్నా. చదువుకుందాం..బాధ్యతగా ఉందాం' అని ట్వీట్ చేసారు.

కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...‘అందరికీ శుభోదయం ఏది ఏమైనా...చారిత్రక నగరమైన హైదరాబాద్ అందరినీ తనలో ఇముడ్చుకోవాలి' అంటూ ట్వీట్ చేసారు.

లక్ష్మీ మంచు
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న ట్వీట్ చేస్తూ...‘శాంతి, ఐకమత్యం ప్రజ్వరిల్లాలని కోరుకుంటున్నాను. మ్యాప్ లో గీత గీసినంత మాత్రాన ఏమీ కాదు. అన్నింటికంటే మన మధ్య ఉండే ప్రేమభావం గొప్పది' అంటూ ట్వీట్ చేసారు.

హీరో నిఖిల్
యువ హీరో నిఖిల్ స్పందిస్తూ...ఇకపై తెలుగు సినిమాలు రెండు రాష్ట్రాల్లో విడుదలవుతాయి. ఎలాంటి సందర్భమైనా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి...ప్రేమ భావాన్ని వ్యాపింప చేయాలి' అంటూ ట్వీట్ చేసారు.

స్మిత
సింగర్ స్మిత రాష్ట్ర విభజనపై స్పందిస్తూ....‘నేను హైదరాబాద్ లో పుట్టాను. మా అమ్మ వైపు వారు తెలంగాణ(ఆలంపూర్)వారు. అమ్మ పేరు జాగులాంబ. ఇక్కడ బాధ అనేది హైదరాబాదో లేక సంపద కోల్పోతున్నందుకు కాదు. రాజకీయ నాయకుల స్వార్థం కోసం కుటుంబాన్ని విడగొట్టారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలం.' అంటూ ట్వీట్ చేసారు.