»   » హీరోల సక్సెస్ పర్సంటేజీలంటూ కొత్త లెక్కలు (ఫోటో ఫీచర్)

హీరోల సక్సెస్ పర్సంటేజీలంటూ కొత్త లెక్కలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మెగా హీరోలదే పైచేయి. సక్సెస్ విషయంలో గానీ, కలెక్షన్ల విషయంలోగానీ......ఇలా ఏ విధమైన లెక్కలు తీసుకున్నా టాప్ లిస్టులో మెగా హీరోల సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోల సక్సెస్ పర్సంటేజీల గురించి చర్చ సాగుతోంది. ఈ విషయంలోనూ వారిదే పైచేయి కావడం గమనార్హం.

ఏ హీరో ఎన్ని సినిమాలు తీసారు. తన ఖాతాలో ఎన్ని హిట్స్ వేసుకున్నాడు, ఎన్ని ప్లాపులు చవి చూసాడు లాంటి గణాంకాలతో సక్సెస్ పర్సంటేజీ లెక్కలేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే... రామ్ చరణ్ ఎక్కువ పర్సంటేజీతో టాపులో ఉన్నాడని అంటున్నారు. యంగ్ టైగర్ జూ ఎన్నీఆర్ తక్కువ పర్సంటేజీతో వెనక బడ్డారు.

సినీ సర్కిల్ లో ఇపుడు ఈ పర్సంటేజీల హడావుడి ఎక్కువైంది. ఈ లెక్కల ప్రకారమే నిర్మాతలు కూడా ఆయా హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. కొన్ని వెబ్ సైట్లు ప్రత్యేకంగా ఈ విషయాలపై వార్తా కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. ఈ హీరో ఇన్ని సినిమాలు తీసాడు, ఇన్ని సక్సెస్ లు, ఇన్ని ప్లాపులు, ఇంత పర్సంటేజీ అంటూ హడావుడి మొదలైంది.

అయితే ఈ లెక్కలు సరిగ్గా లేవని అనే వారూ ఉన్నారు. అయినా ఎక్కువ సినిమాలు చేసిన వారితో, తక్కువ సినిమాలు చేసిన వాని పోల్చడం ఏమిటనే వారూ లేక పోలేదు. రామ్ చరణ్ లాంటి వారు తక్కువ సినిమాలు చేసారు కాబట్టి సక్సెస్ పర్సంటేజీ ఎక్కువగా ఉంది, ఆయన కంటే పర్సంటేజీ తక్కువ ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు ఆయనకంటే తక్కువైపోతారా? అని ప్రశ్నించే వారూ లేక పోలేదు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

రామ్ చరణ్

రామ్ చరణ్

చేసిన సినిమాలు 8, అందులో ఆరు హిట్లు, 2 ప్లాపులు సక్సెస్ పర్సంటేజీ 75% అంటూ ప్రచారం మొదలెట్టారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

చేసిన సినిమాలు 14, అందులో 7 హిట్లు, 7 ప్లాపులు....50% సక్సెస్ పర్సంటేజీ అంటూ ప్రచారం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ 18 సినిమాలు, 8 హిట్లు, 10 ప్లాపులు 44.5% పర్సంటేజీ అని లెక్కలేస్తున్నారు.

ప్రభాస్

ప్రభాస్

చేసిన సినిమాలు 16....9 ప్లాపులు, 7 హిట్లు. సక్సెస్ పర్సంటేజీ 44%

మహేష్ బాబు

మహేష్ బాబు

చేసిన సినిమాలు 20, 8 హిట్లు, 12 ప్లాపులు. సక్సెస్ పర్సంటేజీ 40%

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

చేసిన సినిమాలు 24, 15 ప్లాపులు, 9 హిట్లు...సక్సెస్ పర్సంటేజీ 37.5

English summary
Telugu actors Pawan Kalyan, Allu Arjun, Ram Charan Teja, Mahesh Babu, Jr NTR, Prabhas success Calculations.
Please Wait while comments are loading...