»   » టాలీవుడ్ సెకండ్ మ్యారేజీలు: ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు!

టాలీవుడ్ సెకండ్ మ్యారేజీలు: ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండో పెళ్లి, పెళ్లికి ముందు సెక్స్ మన సమాజంలో ఇంకా అంతగా ఇమడని అంశాలు. అయితే సినిమా రంగానికి ఈ సాంప్రదాయం చాలా కాలం క్రితమే ప్రవేశించింది. ఇలాంటివన్నీ టాలీవుడ్లో చాలా కామన్ అయిపోయాయి. పెళ్లికి ముందు సెక్స్...పిల్లలను కనడం లాంటివి చేసిన స్టార్స్ తెలుగు పరిశ్రమలోనూ ఉన్నారు.

ఇక రెండో పెళ్లి గురించిన అంశాల్లోకి వెళితే....ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా చక్రం తిప్పిన సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండే లాంటివి ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒక్కో స్టార్ రెండో వివాహం వెనక ఒక్కో బలమైన కారణం దాగి ఉంది. ఆ కారణాలు యాక్సెప్టబుల్‌గా ఉండటంతో అభిమానులు, ప్రేక్షకుల నుండి కూడా మద్దతు లభించింది.

రెండో పెళ్లి చేసుకున్న స్టార్స్ వివరాలు... అందుకు గల కారణాలు స్లైడ్ షోలో....

ఎన్టీ రామారావు

ఎన్టీ రామారావు

ఎన్టీ రామారావు 20 ఏళ్ల వయసులోనే తన మేనమామ కూతురు బసవ తారకంను పెళ్లాడారు. ఈ దంపతులకు 12 మంది సంతానం. అందులో 8 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తన 70వ ఏట రామారావు లక్ష్మి పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. మలి వయసులో తన తోడు కోసమే ఆయన ఈ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం ఓ సంచలనం.

నాగార్జున

నాగార్జున

అక్కినేని నాగార్జున తొలుత ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మిని పెళ్లాడారు. అయితే పలు కారణాలతో ఇద్దరూ కొంతకాలానికే విడిపోయారు. తర్వాత తన కోస్టార్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మి ద్వారా నాగ చైతన్య, అమల ద్వారా అఖిల్ జన్మించారు.

కృష్ణ

కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ తొలుత ఇందిరా దేవిని పెళ్లాడారు. వీరికి రమేష్ బాబు, మహేష్ బాబ, మంజుల, ప్రియదర్శిని జన్మిచారు. తర్వాత తన సహనటి, దర్శకురాలు విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు కృష్ణ.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలుత నందిని అనే మహిళను పెళ్లాడారు. కారణాలేంటో తెలియదు కానీ అది కొద్ది కాలంలోనే ఈ జంట విడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రేణు దేశాయ్ నుండి విడిపోయిన పవన్... విదేశీ అమ్మాయిన అన్నా లెజెనివాను మూడో వివాహం చేసుకున్నారు.

కమల్ హాసన్

కమల్ హాసన్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. తొలుత ఆయన డాన్సర్ వాణిగణపతిని పెళ్లాడారు. అయితే వీరి వైవాహిక బంధం పదేళ్ల కంటే ఎక్కువ నిలవలేదు. తర్వాత తన సహనటి సారికతో సహజీవనం చేసిన ఆయన శృతి హాసన్ పెట్టిన తర్వాత ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అక్షర హాసన్ జన్మించిన కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటి గౌతమితో సహజీవనం చేస్తున్నారు.

కృష్ణం రాజు

కృష్ణం రాజు

ఒకప్పటి స్టార్ నటుల్లో ఒకరైన కృష్ణం రాజు తొలుత సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె యాక్సిడెంటులో మరణించడంతో 1996లో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యల ద్వారా కృష్ణం రాజుకు కూతుళ్లే జన్మించారు. దీంతో కృష్ణం రాజు వారసత్వం పుచ్చుకున్న ఆయన తమ్ముడి కొడుకు ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

రమణ చలం

రమణ చలం

పాత తరం నటుల్లో ఒకరైన కొరడ సూర్య చలం అలియాస్ రమణ చలం తొలుత రమణ కుమారిని వివాహం చేసుకున్నారు. 1964లో ఓ యాక్సిడెంటులో ఆమె మరణించడంతో ఊర్వశి శారదను రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఆర్ శరత్ కుమార్

ఆర్ శరత్ కుమార్

తెలుగులో చాలా సినిమాల్లో నటించిన తమిళ నటుడు శరత్ కుమార్ అందరికీ పరిచయమే. శరత్ కుమార్ 1984లో ఛాయను పెళ్లాడారు. వీరికి వరలక్ష్మి, పూజ అనే ఇద్దరు సంతానం. 2000 సంవత్సరంలో ఇద్దరూ విడిపోయారు. 2001లో శరత్ కుమార్ రాధికను రెండో వివాహం చేసుకున్నారు. రాధికకు ఇది మూడో వివాహం. అంతకు ముందు ఆమెకు రెండు వివాహాలు అయి డైవర్స్ అయ్యాయి.

మోహన్ బాబు

మోహన్ బాబు

మోహన్ బాబు మొదట విజయాదేవిని వివాహమాడారు. వీరికి లక్ష్మి, విష్ణు ఇద్దరు సంతానం. ఆమె మరణం తర్వాత మోహన్ బాబు విజయాదేవి సోదరి నిర్మలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్ జన్మించాడు.

శరత్ బాబు

శరత్ బాబు

తెలుగు సినీ పరిశ్రమ సీనియర్ నటుల్లో ఒకరు శరత్ బాబు. తొలుత ఆయన నటి రమ ప్రభను వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత శరత బాబు స్నేహ లతను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా విడిపోయిన ఆయన 61వ ఏట ఓ జర్నలిస్టును మూడో వివాహం చేసుకున్నారు.

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తొలుత లలిత కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆయన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు.

కీర్తి రెడ్డి

కీర్తి రెడ్డి

పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి తొలుత నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ ను పెళ్లాడింది. తర్వాత అతనితో విడిపోయిన ఆమె ఎన్నారైని పెళ్లాడి యూఎస్ఏలో సెటిలైంది.

English summary
Second marriages are not a new trend in Telugu film industry. Right from late legendary actor NT Rama Rao to modern day superstar Pawan Kalyan, many Telugu stars have married twice in Tollywood. We bring you the list of 10 top actors, who have divorced their first wife or husband and got married for second time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu