twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ విభజన: సానుకూలంగా ఏపి ఫిలిం ఛాంబర్!

    By Bojja Kumar
    |

     Telugu film industry to divide soon
    హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశం నేడు(జులై 4) ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో సినిమా పరిశ్రమ ఎందుకు రెండుగా విడి పోవాలో, దాని ఆవశ్యకత ఏమిటో తెలంగాణా ప్రతినిధులు వివరించారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా విభజనలోని ప్రతి అంశంలో తెలంగాణా కోణం నుండి అలోచించి అనుకూల నిర్ణయాలే తీసుకోవాలనే పద్దతిలో సినిమా పరిశ్రమ రెండుగా విడిపోయి కలిసి పని చేసుకోవచ్చు అని వారు వివరించారు.

    విభజన ప్రక్రియ స్పష్టంగా త్వరిత గతిన జరగాలని తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తన వాదన వినిపించారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ తెలంగాణా నిర్మాతల సంఘం అధ్యక్షుడు సాన యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏర్పరచిన విభజన సిద్ధాంతం ఆధారంగా సినిమా పరిశ్రమను కూడా విభజించాలని కోరారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన రీతిగానే సినిమా పరిశ్రమ కూడా విడిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణా దర్శకుల సంగం అధ్యక్షులు అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ సామరస్య పూర్వకంగా తెలుగు సినిమా పరిశ్రమ విభజన జరిగితే అందరూ కలిసికట్టుగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని, తెలంగాణాకు సినిమా ప్రపంచంలో గుర్తింపు వస్తుందని, హైదరాబాద్ ఐదు భాషల సినిమాలకు ఒక హబ్‌గా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

    ఇప్పుడు అందరం కలిసుండాలని అంటున్న పెద్దలు తెలంగాణా ఫిలిం ఛాంబర్‌ను ఎందుకు కలుపుకు పోలేదని తెలంగాణా నిర్మాతల సంగం ప్రధాన కార్యదర్శి సంగ కుమార్ అన్నారు. ప్రస్తుతం సమయ ఉన్నందున ఇరు ప్రాంతాల సినిమా పెద్దలు కుర్చుని సామరస్యంగా సినిమా పరిశ్రమను విభజించాలని తెలంగాణా సినిమా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి ఏపి ఫిలిం ఛాంబర్ వారు సానుకూలంగా స్పందించారు.

    ప్రస్తుతం ఉన్న ఛాంబర్ పేరును తెలుగు ఫిలింఛాంబర్‌గా మార్చాలన్న ప్రతిపాదన‌కు అత్యవసరంగా చేయవలసిన ఆవశ్యకత లేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్‌లు అభిప్రాయ పడ్డం‌తో సభ వాయిదా పడిందతీ తెలంగాణ నిర్మాతల సంఘం సభ్యులు తెలిపారు.

    English summary
    
 Telugu film industry to divide soon. AP Film Chamber Members Think positive on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X