twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న నేడు రేపు (స్మాల్ రివ్యూ)

    By Staff
    |

    Ninna Nedu Repu
    రోజు రోజుకీ పెర్గిపోతున్న సిటీ జీవితంలోని లోటు పాట్లను,ఓ సామాన్యుడు కోణంలో చర్చించే ప్రయత్నం చేస్తూ వచ్చిన చిత్రం 'నిన్న నేడు రేపు'. కొత్త తరహాలో సాగే ప్రయత్నం అబినందనీయమే అయినా ఆ కథను చెప్పటానికి మహేష్ బాబు అతడు సినిమాలోని మెలికను(ఒకరు ప్లేస్ లో మరొకరు వస్తే ఏం జర్గుతుంది) తీసుకోవటం బ్యాడ్ అనిపిస్తుంది. అలాగే కథనంలో ఎక్కడా డెప్త్ (లోతుగా) వెళ్ళకపోవటం నిరాశ కల్గిస్తుంది. అలాగే ఎనీ 'ఎమోషన్ సింగిలి ఎక్స్ ప్రెషన్స్' అన్నట్లు పొరపాటున కూడా భావోద్వేగాలు పలికించని రవికృష్ణని చూస్తే విసుగనిపిస్తుంది.

    హైదరాబాద్ సిటీకొచ్చి తల్లితండ్రులను సైతం పోగొట్టుకని,ప్రేయసి (తమన్నా) కి బర్తడే గిప్ట్ సైతం కొనివ్వలేక ఈసడింపులకు గురవుతున్న వ్యక్తి విజయ్(రవి కృష్ణ). అన్ని రకాలుగా ఓడిపోయానని ఇక జీవితంలో ఏం చేయలేమని నిరాశలో పడి రైలు పట్టాలపై అడ్డంగా పడుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.అయితే అనుకోని స్దితిలో అతనికి తన లాగే అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో వ్యక్తి కిషోర్ సెల్ ఫోన్ దొరుకుతుంది. అందులో వచ్చిన ఓ కాల్ ద్వారా కిషోర్ కి రావాల్సిన ఐదు లక్షలు అందుకుంటాడు.అలాగే కిషోర్ ని ఫోన్ లోనే ప్రేమించే అక్షర ని లైన్ చేస్తాడు. ఇక ఇలా సుఖంగా గడిచిపోతుందనుకున్న సమయంలో ఆ ఐదు లక్షలు తెచ్చివ్వమని ముంబై డాన్ (అజయ్) నుండి ఫోన్ వస్తుంది. అప్పుడు విజయ్ ఏం నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ.

    దర్శక,రచయిత ఈ కథ ద్వారా ఏం చెప్దామనే స్పష్టత లేకపోవటం పూర్తిగా కనపడుతుంది. అలాగే స్క్రీన్ ప్లే కథను అసహనంగా మార్చేసింది. అప్పటికీ అక్షయ తన శక్తి మేరకు అంగాంగ ప్రదర్శన చేసింది. దర్శకుడూ పూర్తి స్ధాయిలో ఓ హాట్ సాంగ్ ని వీరిపై కంపోజ్ చేయించాడు. ఇక డైలాగులు రచయిత కొరటాల శివ చాలా చోట్ల బూతుని ప్రదర్శించబోయి సెన్సార్ కత్తెరకు బలయ్యిపోవటం తెలిసిపోతూంటుంది. అయితే వేణుమాధవ్ చేసిన పోకిరి పేరడీ కామిడీ ట్రాక్ బాగా పేలింది.ఇక దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా టేకింగ్ పరంగా బాగా చేసినా కాస్టింగ్ మరింత మంచివాళ్ళను ఎన్నుకుంటే బాగుండేదని పిస్తుంది. అలాగే నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు కాస్త లేటుగా రిలీజ్ చేసినా సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. పెద్ద ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్ళితే టైంపాస్ కి ఫరవాలేదనిపిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X