twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం!

    |

    దర్శకుడిగా కోడి రామకృష్ణకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోలందరితోనూ ఆయన చిత్రాలు తెరకెక్కించారు. ఎన్నో ఘనవిజయాలు ఆయన దర్శత్వంలో నమోదయ్యాయి. తాజాగా ఆయన గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. కోడి రామకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం..

    ఆరోగ్యం విషమించడంతో

    ఆరోగ్యం విషమించడంతో

    కోడి రామకృష్ణ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని గచ్చిబౌలి లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంది చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది డాక్టర్ల టీం, ఓ ఫిజీషియన్ కూడా ఆయన కు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

     గతంలోనే హార్ట్ అటాక్

    గతంలోనే హార్ట్ అటాక్

    కొన్నేళ్ల క్రితమే కోడి రామకృష్ణ హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన కోలుకున్నారు. 1982లో చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా మారారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇప్పటివరకు ఆయన 100కు పైగా చిత్రాలకు దర్శత్వం వహించారు.

     ఆయన ప్రత్యేకత ఇదే

    ఆయన ప్రత్యేకత ఇదే

    పెద్దగా టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఫాంటసీ, సూపర్ నాచురల్ చిత్రాలని తెరకెక్కించిన అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఆడియన్స్ ని అబ్బురపరిచారు. అమ్మోరు, దేవి, అరుంధతి, అంజి చిత్రాలు ఈ కోవకు చెందినవే. కోడి రామకృష్ణ చివరగా తెరకేకించిన చిత్రం నాగహారవు. ఇది కన్నడలో రూపొందింది. కుటుంబ కథ చిత్రాలని కూడా తనదైన శైలిలో రూపొందించి ఆడియన్స్ ని మెప్పించారు.

    నటుడిగా కూడా

    నటుడిగా కూడా

    2012లో తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోడి రామకృష్ణ క్రమంగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కోడి రామకృష్ణ నటుడిగా కూడా దొంగాట, అత్తగారూ స్వాగతం లాంటి చిత్రాల్లో నటించారు.

    English summary
    Telugu filmmaker Kodi Ramakrishna hospitalised and critical, on ventilator
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X