యాక్సిడెంటల్ గా... హీరో తనీష్ తండ్రి వర్థన్ మృతి
హైదరాబాద్: నటుడు తనీష్ తండ్రి వర్థన్ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. తనీష్ కుటుంబ సభ్యులు మణికొండలోని వెస్టర్న్ ప్లాజాలో నివాసముంటున్నారు. అర్థరాత్రి ప్రమాదవశాత్తూ ఆరో అంతస్తు నుంచి కిందపడిన వర్థన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఆయన పార్దివ దేహాన్ని పోర్ట్ మార్టం అనంతరం కుటుంబ సబ్యులకు అందచేస్తారు. రైడ్, చాణుక్యుడు, మౌనరాగం, నచ్చావులే వంటి తదితర చిత్రాల్లో తనీష్ హీరోగా నటించాడు.



Click it and Unblock the Notifications











