»   » షారుక్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.. తెలుగు సీన్లు కాపీ!

షారుక్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.. తెలుగు సీన్లు కాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : షారుక్ ఖాన్‌, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'. ఆగస్టు 8న విడుదలకు సిద్ధమైన ఈచిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

కాగా...తాజాగా విడుదలైన ఈచిత్రం ట్రైలర్ చూస్తుంటే పలు దక్షిణాది చిత్రాలతో పాటు, తెలుగు సినిమాలైన ఒక్కడు, నరసింహ నాయుడు, అంత:పురం, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లోని సీన్లను దర్శకుడు రోహిత్ కాపీ కొట్టాడని స్పష్టం అవుతోంది. ఆ సీన్లన్నీ దక్షిణాది సినిమాల్లో బాగా పాపులర్ అయినవే.

బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమాల పరిచయం లేదు. దీంతో వాటిని తన క్రియేటివిటీగా అక్కడి ప్రేక్షకులకు చూపించబోతున్నాడు దర్శకుడు. రోహిత్ శెట్టికి బాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఆయన 8 సినిమాలు తీస్తే అందులో 7 సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం యావరేజ్.

Chennai Express official trailer

రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక. ఈ సినిమా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Shahrukh Khan and Deepika Padukone starrer Chennai Express official trailer of the movie has been released friday on UTV Motion Pictures. the action comedy film directed by Rohit Shetty and produced by Gauri Khan under her production banner Red Chillies Entertainment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu