twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడే ‘మగాడు’...(మహేష్ ‘మర్డ్’ కవిత)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమైన 'మర్డ్' ఉద్యమంలో పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మహేష్ బాబు పాలుపంచుకోబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు పర్హాన్ అక్తర్ ఈ 'మర్డ్' ఉద్యమాన్ని ప్రారంభించారు.

    మర్డ్ అంటే 'మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్'. బాలీవుడ్ ఫేమస్ పాటల రచయిత జావేద్ అక్తర్ ఈ సంస్థ ప్రచారం కోసం ఓ కవితని రాశారు. దాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. తెలుగులో మహేస్ చెప్పిన ఆ కవితను క్రింద పేర్కొనబడింది.

    ఎవరి కళ్లలో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో..
    ఎవరి మాట మన్ననగా ఉటుందో..
    ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
    ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో...
    ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటుందో..
    ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి, ఆత్మకి, విలువ ఇస్తారో...
    వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో...
    ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో...
    స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంది..గౌరవం ఉండాలి అని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..
    ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్ముకం ఉంటుందో...
    అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు...
    ఒక్క మాటలో చెప్పాలంటే వాడే 'మగాడు'

    'సమాజంలో ఓ మంచి మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సపోర్టు చేస్తున్నందుకు థాంక్స్ మహేష్' అంటూ ఫర్హాన్ అక్తర్ ఇటీవల ట్వీట్ చేసారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులు, అత్యాచారాలకు కదిలిపోయిన పర్హాన్ అక్తర్ 'మెన్ అగైనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్'(MARD) అనే సంస్థను ప్రారంభించారు. సమాజంలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఆమెను ఏ విధంగా గౌరవించాలి? అనే విషయాల్లో మగవాళ్లకు అవగాహన కల్పించడమే ఈ మర్డ్ ఉద్యమం ఉద్దేశ్యం. 'మర్డ్' సంస్థ ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్రజలందరికీ చేరేలా చేయ్యగలవారు ఎవరా అని కొన్ని రోజులు సర్వే చేసి మరీ....మహేష్ బాబుని ఎంచుకున్నారు.

    ఇతర భాషల్లోకి కూడా దీన్ని అనువదిస్తున్నారు. అదే విధంగా మరాఠీ భాషలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వాయిస్ ఇచ్చారు. త్వరలోనే వీరి వాయిస్‌ను మనం ప్రచార మాద్యమాల్లో వినబోతున్నాం. దేశంలోని ఇతర భాషల్లో కూడా 'మర్డ్' ప్రచారం సాగనుంది. ఆయా ప్రాంతాల్లో పాపులర్ స్టార్ల వాయిస్‌ను ఈ కాంపెయిన్ కోసం రికార్డు చేయనున్నారు.

    English summary
    Telugu rendition of the ‪‎MARD‬ poem released. Sachin, Mahesh's voices recorded for Bollywood director Farhan Akthar's initiative 'MARD' (Men Against Rape and Discrimination) campaign. In Telugu, Mahesh Babu has rendered his voice and Sachin Tendulkar in Marathi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X