»   » తాగి.., కారునడిపి.... నటుడు భరణి పై కేసు నమోదు

తాగి.., కారునడిపి.... నటుడు భరణి పై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఎన్ని కేసులు బుక్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదౌతూనే ఉన్నాయి. ఇక జూబ్లిహిల్స్ లాంటి ఏరియాల్లో అయితే సెలబ్రిటీలు పట్టు బడటం మామూలైపోయింది. తెలంగాణ ట్రాఫిక్ సిబ్బంది చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. చట్టానికి అందరూ సమానమే అన్నట్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎలాంటి వారు పట్టుబడినా నిర్మోహమాటంగా జరిమానా విధిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు సెలబ్రెటీలు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలు, వైద్యలు, రాజకీయ నాయకులు వారి సంతానం పట్టుబడుతూనే ఉన్నారు అయినా ప్రతీ నెలా రెండు నెలలకి ఒక సారి కేసులు బుక్ ఔతూనే ఉన్నాయి. ఆ మద్య అమ్మ రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి దీనిపై మీడియాలో మరింత ఫోకస్ అయ్యింది.

Telugu TV serial actor Bharani caught drunk driving

ఒక సెలబ్రిటీ పట్టుబడితే ఆకొద్దిరోజులూ కాస్త తగ్గినా మళ్ళీ మామూలే.. నిన్నరాత్రికూడా జూబ్లిహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో జరిగిన డ్రైవ్ లో బుల్లితెర నటుడు భరణి తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్ పర్సెంటేజీ 41% చూపించటం తో. కారుని సీజ్ చేసి. భరణి పై కేసు బుక్ చేసారు.

English summary
Telugu TV serial actor Bharani was caught in drunken driving case.Traffic police registered a case and seized his car. Bharani is famous for his role in Seetha Mahalakshmi serial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu