»   » వెంకటేష్, అఖిల్ నేతృత్వంలో తెలుగు వారియర్స్

వెంకటేష్, అఖిల్ నేతృత్వంలో తెలుగు వారియర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా తారలు ఆడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నతరుణంలో ఈ మెగా సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే జరిగిన సిసిఎల్ టోర్నీలు విజయవంతం అయిన నేపథ్యంలో 2014లో జరిగే టోర్నీని మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జరిగే టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు వెంకటేష్, అక్కినేని అఖిల్ సంయుక్తంగా నేతృత్వం వహించనున్నారు. వెంకటేష్ కెప్టెన్‌గా, అఖిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

అఖిల్ ఇప్పటికే పలు సందర్భాల్లో క్రికెట్ ఆటలో తన ప్రతిభను కనబర్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో అఖిల్ ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో అతనికి వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా మరింత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది.

 Telugu Warriors: Venkatesh captain and Akhil vice captain

ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో సిసిఎల్ సరికొత్త సీజన్ ట్రోఫీని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించాడు. దేశంలోని వివిధ సినీ రంగాలకు చెందిన ఎనిమిదిజట్ల ప్రముఖులు, జట్ల సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మాస్టర్ సచిన్.. తన భార్య అంజలితో సహా హాజరయ్యాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్, భోజ్ పురి, బెంగాలీ రంగాలకు చెందిన జట్లు ఈ లీగ్ లో పోటీపడనున్నాయి. 2014 జనవరి 25న ముంబైలో ప్రారంభ మ్యాచ్ నిర్వహిస్తారు.

ఎనిమిది జట్లు.. రెండు గ్రూపులుగా తలపడిన అనంతరం సెమీ ఫైనల్స్ నాకౌట్ పోటీలు నిర్వహిస్తారు. టైటిల్ సమరం హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగుతుంది. కేవలం వారాంతపు చివరి రెండు రోజుల్లో మాత్రమే జరిగే ఈ లీగ్ లో కేరళ స్ట్రయికర్స్, చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, కర్నాటక బుల్ డోజర్స్, భోజ్ పురి దంబాద్, వీర్ మరాఠీ, ముంబై హీరోస్ జట్లు తలపడుతున్నాయి.

English summary
Victory Venkatesh and Akhil Akkineni will be leading the Telugu Warriors team this season. Venkatesh will be the captain and Akhil will be the vice captain for the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu