»   » లివ్ ఇన్ రిలేషన్ షిప్ రచ్చ :ఇంతకీ ఈ గీతా సుబ్రమణ్యం..ఎవరు?

లివ్ ఇన్ రిలేషన్ షిప్ రచ్చ :ఇంతకీ ఈ గీతా సుబ్రమణ్యం..ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక అమ్మాయి..అబ్బాయి..సహజీవనం అదేనండీ...లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటే....అవును ఉంటే అందులో తప్పేముంది అంటారా...మేమూ కూడా తప్పేమీ పట్టడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో కామన్ అయ్యిపోయింది. ముఖ్యంగా సాప్ట్ వేర్ వంటి వృత్తులలో ఉండేవారు, సినీ సెలబ్రెటీలు లివ్ ఇన్ రిలేషన్ షిప్ నే ఎంచుకుంటున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్....రేణుదేశాయ్ ల లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి రకరకాల వార్తలు వచ్చేవి.

నిజానికి విదేశాల్లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది అతి సామాన్యమైన విషయం. ఇప్పుడిప్పుడే ఇండియా, ముఖ్యంగా ముంబయ్ లాంటి మహానగరానికి చెందిన యువత లివ్ ఇన్ రిలేషన్ షిప్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ పాయింట్ తో మణిరత్నం తనదైన శైలిలో తెరకెక్కించిన చిత్రం 'ఓకే బంగారం' . ఆ సినిమా బాగానే ఆడింది.

 Telugu Web Series...Geetha Subramanyam get great response

వాస్తవానికి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఎలాంటి సమస్యలు వస్తూంటాయి. సమాజం ఓ ప్రక్కన వింతగా చూస్తూంటుంది. మరో ప్రక్కన వైవాహిక బంధం లేని వీళ్లిద్దరూ ఒకే చోట ఉంటున్నప్పుడు వీరి మధ్య సెక్సువల్ రిలేషన్ షిప్ ఏర్పడదా..వంటి సందేహాలు వస్తూంటాయి బయిట నుంచి చూసే వాళ్లకు. ఎందుకంటే ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మనదేశంలో పాపులర్ అవుతోంది. అందుకేనేమో తమడా మీడియా ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఈ సబ్జెక్టుతో గీతా సుబ్రమణ్యం టైటిల్ తో ఓ వెబ్ సీరిస్ చేసేసి మన ముందుకు వచ్చారు.

గీతా , సుబ్రమణ్యం అనే అమ్మాయి..అబ్బాయి...ఇద్దరూ వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తూంటారు. వీరి ఏటిట్యూడ్స్ ఏంటి..వాళ్లు మధ్య ప్రేమ, ఎమోషన్ వివాహిక బంధానికి దారి తీస్తాయా...ఏమో అప్పుడే చెప్పలేం...ప్రస్తుతం కుర్రాళ్లకు కిక్ ఇచ్చే ఫన్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. మేం చెప్పేది నమ్మం అంటారా... క్రింద టీజర్ పై ..ఓ లుక్కేయండి మరి..

ఈ వెబ్ సీరిస్ లో హీరో,హీరోయిన్స్ లైఫ్ లో జరిగే రకరకాల సిట్యువేషన్స్ ని దర్శకుడు సాయి చాలా ఇంట్రస్టింగ్ వేలో చూపించారు. ముఖ్యంగా రాబోయే ఎపిసోడ్ లో హీరోయిన్ బర్తడే పార్టీ ఎపిసోడ్ అయితే నవ్వకుండా ఉండలేరంటున్నారు.

ఫస్ట్ సీజన్ కు 11 ఎపిసోడ్స్ తో సాగే సీరిస్ కు ఇంకో ప్రత్యేకత ఉందండోయ్... ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల రాసిన పాట. ఈ పాట నిజంగా సినిమా పాటలను మించిపోయిందనే ప్రశంసలు వస్తున్నాయి.

మనోజ్, దర్శని హీరో,హీరోయిన్స్ గా చేసిన ఈ వెబ్ సీరిస్ యూ ట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేస్తోంది.రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి బుర్రా కలిసి తమ తమడా మీడియా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ వెబ్ సీరిస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నీహారిక చేసిన 'అవకాయ్ ముద్దపప్పు' స్దాయిలో ఈ వెబ్ సీరిస్ భారీ స్దాయిలో సక్సెక్ అవుతుందని ఆశిద్దాం.

English summary
And here are two people who reflect all of us in life. Geeta and Subramanyam are not just in this episode but inside each one of us. Enjoy the cute love story between these two.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu