»   » 'టెంపర్' పాత్ర ఎందుకు వద్దునుకున్నారో 'ఆర్. నారాయణ మూర్తి' వివరణ

'టెంపర్' పాత్ర ఎందుకు వద్దునుకున్నారో 'ఆర్. నారాయణ మూర్తి' వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు,నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి చివరకు తన పెదవి విప్పారు. పూరి జగన్నాథ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రంలో పాత్ర ఎందుకు చెయ్యలేదనే విషయమై ఆయన ఓ టీవి ఇంటర్వూలో వివరణ ఇచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ... "నాకు చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు సైడ్ రోల్స్ చేయటానికి మనస్సు ఒప్పలేదు. నేను నాకు ఇష్టమైన చిత్రాలు చేసుకుంటూ, పాత్రలు చేసుకోవటంలోనే ఆనందం పొందుతా ," అన్నారు.


Temper: NTR is Great, But Don't Want to Act with Others

ఆయన కంటిన్యూ చేస్తూ.."లెజండరీ నటులు ఎన్టీఆర్, ఎ ఎన్నార్ నాన్ లీడ్ రోల్స్ చేసారు అవసరమైనప్పుడు అనేది నిజం. వారికన్నా నేను ఏమీ పెద్ద వాడ్ని కానీ గొప్పవాడ్ని కాదు. కానీ నాకు అలాంటి పాత్రలు చేయటానికి మనస్సు ఒప్పటం లేదు. వారిలా కాకుండా నేను ..నేను క్రింద లెవిల్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగినవాడ్ని. వారు డైరక్ట్ గానే హీరోలయ్యారు....టాప్ లోనే ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు..ఆయన చేసిన పాత్రలు వేరే వారు చెయ్యలేరు అని తేల్చి చెప్పారు.


ఇదే విషయమై జగపతిబాబు సైతం ఇలా...


జూ.ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'టెంపర్' చిత్రం గురించి సీనియర్ నటుడు జగపతిబాబు మాట్లాడారు. ఆ చిత్రం 45 కోట్లు షేర్ వచ్చింది. అయినా మరో ఎనిమిది కోట్లు వచ్చి ఉండేవని ఆయన అంటున్నారు.


రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... తాను గనుక ..పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర కనుక చేసి ఉంటే..మరో ఎనిమిది కోట్లు నిశ్సందేహంగా వచ్చి ఉండేవని అన్నారు. ఈ విషయమై ఆయన ఓ విలువైన పాయింట్ ని కూడా చెప్పారు.


Temper: NTR is Great, But Don't Want to Act with Others

జగపతిబాబు మాట్లాడుతూ...' హీరోయిజమ్... ఎప్పుడు బాగా ఎలవేట్ అవుతుందంటే...ఓ సీనియర్ హీరో... తారక్ లాంటి ఓ స్టార్ హీరోకు సెల్యూట్ చేసినప్పుడు అన్నారు. అప్పుడు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది కోట్లు భాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టేవి " అన్నారు.


అలాగే తనకు తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని ప్రత్యేకమైన ఛాలెంజెంగ్ రోల్స్ ఇచ్చి వినియోగించుకోవచ్చని అన్నారు. అమితాబ్, ప్రాణ్,ప్రకాష్ రాజ్ వంటివారు చేస్తున్న పాత్రలను తాను సమర్ధవంతంగా చేయగలనని చెప్పారు.


ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు సినిమా కెరీర్ ప్రస్తుతం మంచి జోరుమీదే ఉంది. హీరో పాత్రలను వదిలేసి....విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం మొదలు పట్టాక అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవలే జగపతి బాబు కూతురు వివాహం కూడా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.

English summary
"I've been offered several prominent roles in the films of star heroes. But somehow I'm not interesting in taking them up. My conscience is not accepting to play sidekick roles after carving out a niche for myself. I'm happy playing the roles I wanted and contented with the movies that I make," said Narayana Murthy in a TV interview.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu