జపాన్‌లో ‘టెంపర్’ లేస్తుందా?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని జపాన్ లోనూ విడుదల చేసారు.
రజనీకాంత్ మరికొందరు ఇండియన్ హీరోలకు జపానీయుల్లో ఫాలోయింగ్ ఉన్నట్లే ఎన్టీఆర్ సినిమాలను కూడా జపాన్ వాసులు ఇష్టపడతారు. సినిమా హిట్ టాక్ రావడంతో జపాన్ లోనూ విడుదల చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

‘టెంపర్' మూవీ 40 కోట్ల క్లబ్బులో చేరి ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. కొంత కాలంగా పడిపోయిన ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా పైకి ఎగిసింది.
సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











