»   » ఎన్టీఆర్ సినిమాకు రెండు బ్లాక్ బస్టర్ సాంగ్స్ రెడీ.. జోరుమీదున్న తమన్!

ఎన్టీఆర్ సినిమాకు రెండు బ్లాక్ బస్టర్ సాంగ్స్ రెడీ.. జోరుమీదున్న తమన్!

Subscribe to Filmibeat Telugu

సంగీత దర్శకుడు థమన్ ప్రస్తుతం కెరీర్ పరంగా జోరుమీద ఉన్నాడు. ఆయన సంగీతం అందిస్తున్న చిత్రాలు మంచి విజయం సాదిస్తున్నాయి. ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి కూడా తమనే సంగీత దర్శకుడు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రాబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబందించిన మ్యూజిక్ పనులతో తమన్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు అదిరిపోయే సాంగ్స్ ని తమన్ ట్యూన్ చేయునట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ చిత్రాలకు తమన్ ఇదివరకే సంగీతం అందించాడు. కానీ త్రివిక్రమ్ సినిమాకి పనిచేయడం మాత్రం ఇదే తొలిసారి. దీనితో ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

Thaman already gave two blockbuster songs for NTR28

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుపుకుంటోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.

English summary
Thaman already gave two blockbuster songs for NTR28. Trivikram is directing this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X