»   » "సైరా" మ్యూజిక్ నాదే, పాపం థమన్: అది నేనే అని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి

"సైరా" మ్యూజిక్ నాదే, పాపం థమన్: అది నేనే అని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న చిరు బర్త్‌డే సందర్భంగా 151 సినిమా "సైరా" టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి రెండూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ మోషన్ పోస్టర్లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు చాలా మంచి టాక్ వచ్చింది. ఈ సందర్భంగా సై..రా నరసింహారెడ్డి మూవీలో నటించే యాక్టర్స్‌తోపాటు టెక్నీషియన్స్ పేర్లు కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహ్మాన్‌ అనే అనుకుంటూ వచ్చారు.

Thaman feels bad about Sayra Teeser Music

అయితే మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్న వారంతా కూడా అది రెహ్మాన్ ఇచ్చారని భావించారు. కానీ అది ఇచ్చింది తానంటూ ఎస్ ఎస్ థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొదట సై..రా నరసింహారెడ్డి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌నే ఎంచుకున్నారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కానీ ఈ మూవీని నేషనల్ వైడ్ ప్రాజెక్టుగా ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పుడు థమన్‌ని పక్కన పెట్టి రెహ్మాన్‌ని సెలక్ట్ చేసుకున్నారని టాక్. మెగాస్టార్ మూవీకి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారడంతో థమన్‌ ఫీలయ్యాడట. ఎంతయినా మనం చేసిన వర్క్ కి రెహమాన్ అంతటివాడితో పోల్చినందుకు ఆనంద పడాలో లేక క్రెడిట్ రెహమాన్ కి ఇచ్చినందుకు భాదపడాలో అర్థం కాని స్థితి. పాపం థమన్...

English summary
Actually Syra Teeser music given by ss Thaman, but all are thinks That work was by AR Rehaman
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu