»   » మళ్లీ పాడాడు...ఈ సారి అంత హిట్టవుతుందా?

మళ్లీ పాడాడు...ఈ సారి అంత హిట్టవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలు గొంతు విప్పి పాడటం కొత్తేమీ కాదు. అయితే అప్పుడప్పుడూ వారు అలా చేస్తూండంటతో ప్రాజెక్టుకు క్రేజ్ వస్తూంటుంది. ఆ మధ్యన బలుపు చిత్రం కోసం పాట పాడిన రవితేజ మరోసారి తన గొంతు విప్పారు. ఈ సారి తన తాజా చిత్రం 'పవర్'కోసం ఆయన పాడాడు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సన్నివేశంలో వచ్చే ఇంపార్టెంట్ పాట కోసం సంగీత దర్శకుడు తమన్ ఒప్పించి పాడించారు. బలుపులో పాట హిట్టైనంత హిట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు రవితేజ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

రచయిత బాబి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ పట్టయాలో యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఉదయం 'పవర్‌' సెట్లో వూహించని సంఘటన జరిగింది. చిత్రీకరణలో భాగంగా ఓ పేలుడు సన్నివేశాన్ని తెరకెక్కించే సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతం కావడం వల్ల సమీపంలోని చెట్లు దహనమైనట్టు సమాచారం. అక్కడున్నవాళ్లంతా సురక్షితంగా బయటపడడంతో చిత్రబృందం వూపిరి పీల్చుకొంది.

Thaman gets Ravi Teja to sing

నిర్మాత మాట్లాడుతూ...''మాస్‌, క్లాస్‌ వర్గాల ప్రేక్షకుల్ని అలరించే హీరో రవితేజ. ఆయన శైలికి తగ్గట్టుగా రూపొందిన కథ ఇది. మాస్‌ పోలీసు.. క్లాస్‌గా ఏం చేశాడో తెరపై చూడాల్సిందే. చిత్రీకరణ చివరి దశకొచ్చింది. త్వరలో పాటల విడుదల తేదీని ప్రకటిస్తాము'' అంటున్నారు.

మాస్‌ అంటే బస్‌పాస్‌ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్‌ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు. ''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary
Ravi Teja will be singing for his upcoming movie ‘Power’ and music director Thaman has convinced him to do so for an important number.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu