»   » పవన్‌తో సెల్ఫీ కోసమే.. తమన్.. ఆయన పాటతో థియేటర్లో గెంతులు..

పవన్‌తో సెల్ఫీ కోసమే.. తమన్.. ఆయన పాటతో థియేటర్లో గెంతులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్, మేఘా ఆకాష్ జంట‌గా నటించిన చిత్రం 'చ‌ల్ మోహ‌న్‌రంగ‌'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలవుతోంది. 'ఛల్‌ మోహన రంగ' విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

Pawan Speaks About His Relationship With Nithin
పవన్‌ కల్యాణ్‌తో సెల్ఫీ

పవన్‌ కల్యాణ్‌తో సెల్ఫీ

త‌మ‌న్ మాట్లాడుతూ "సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప‌వ‌న్‌ కల్యాణ్‌ గారితో ఓ సెల్ఫీ తీసుకోవాల‌ని వ‌చ్చాను. అది కుదిరింది. ఈ సినిమాకు ప‌నిచేసిన గీత రచయితలందరికీ ధ‌న్య‌వాదాలు. సినిమాటోగ్రాఫర్ న‌ట్టి విజువ‌ల్స్ చాలా బావుంటాయి. నేను హీరోల‌కు ప‌నిచేసిన తొలి సినిమాల‌న్నీ హిట్టే. నితిన్‌తో ఇది నా తొలి సినిమా. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది అని అన్నారు.

పవన్ నిర్మాతగా

పవన్ నిర్మాతగా

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌గారి నిర్మాణంలో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది" అని తమన్ తెలిపారు. ఆయన నిర్మాతగా తీసిన చిత్రంలో నేనో సాంకేతిక నిపుణుడిగా పనిచేయడం సంతోషంగా ఉంది. కృష్ణ చైతన్య మంచి స్నేహితుడు. స్క్రిప్టు చాలా బాగా చేశాడు. సినిమా బాగుంది. నట్టి అందించిన విజువల్స్‌ ప్రధాన బలం. ఆయన విజువల్స్‌ వల్లే ఆర్‌.ఆర్‌ బాగా చేయగలిగా'' అని ఆయన అన్నారు.

ఖుషీ సినిమా నుంచి

ఖుషీ సినిమా నుంచి

ఛల్‌ మోహన రంగ చిత్ర ప్రీరిలీజ్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు కాక‌ముందు నుంచీ `ఖుషీ`స‌మ‌యం నుంచీ తెలుసు. మ‌ణిశ‌ర్మ‌గారిని `నాకు ఓ హిందీ పాట కావాలి. థియేట‌ర్‌లో గెంతులు వేయాలి` అని అడిగా. ఆయ‌న బాధ్య‌త‌ను త‌మ‌న్ మీద పెట్టారు. ఈ సినిమాకు ఆయ‌న మంచి బాణీలిచ్చారు.

ఖుషీలో ఆ పాటకు

ఖుషీలో ఆ పాటకు

‘ఖుషి'లో ‘ఏ మేరా జహా' పాట అంత బాగా రావడానికి కారణం తమన్‌. అప్పట్లో మణిశర్మ దగ్గర ఉండేవారు. ఈ పాట బాధ్యత అంతా మణిశర్మ తమన్‌పై పెట్టారు. ‘థియేటర్లో గంతులు వేయాలి.. ఆ పాట హిందీలో ఉండాలి' అని తమన్‌కి చెప్పా. ఇప్పటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రానికీ మంచి పాటలు ఇచ్చాడు. నితిన్‌ మరిన్ని మంచి విజయాలు పొందాలని కోరుకుంటున్నా అని పవన్ కల్యాణ్ అన్నారు.

English summary
The Pre-Release event of 'Chal Mohana Ranga' was held on Sunday in Hyderabad. Besides the film's cast and crew, Power Star Pawan Kalyan graced the occasion as the chief guest. Thaman said, "I have come to attend this event just to have a selfie with Pawan Kalyan garu. Coming to this film, Natty's awesome visuals have helped me compose a better background music. My first films with any hero have been hits. And this is my first movie with Nithiin. It will definitely be a hit."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X