»   » ఎన్టీఆర్ మూవీ నుంచి అనిరుధ్ అవుట్..కొత్త సంగీత దర్శకుడు అతడే..!

ఎన్టీఆర్ మూవీ నుంచి అనిరుధ్ అవుట్..కొత్త సంగీత దర్శకుడు అతడే..!

Subscribe to Filmibeat Telugu
తొలిప్రేమ ఎఫెక్ట్ : ఎన్టీఆర్ మూవీ నుంచి అనిరుధ్ అవుట్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ లో ఇంకా గందరగోళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. అజ్ఞాతవాసి చిత్రం తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ లెక్కలు సరిచేసుకునే పనిలో ఉన్నారని, మొత్తగా ఈ సినిమానే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని వార్తలు వచ్చాయి. అంతలోనే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ మీడియాలో లీకులు. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా గురించిన వార్తలు ఆగడం లేదు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మార్పు అనివార్యం అని తేలిపోయింది. ఈ మేరకు ప్రధాన మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో థమన్ ని తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్.

అనిరుధ్ పై నమ్మకం ఉంచిన త్రివిక్రమ్

అనిరుధ్ పై నమ్మకం ఉంచిన త్రివిక్రమ్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం అజ్ఞాతవాసి విడుదలకంటే ముందుగా పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది. ఈ ఈవెంట్ కు అనిరుద్ కూడా హాజరయ్యాడు. ఎన్టీఆర్ కు తగ్గ సంగీతాన్ని అనిరుద్ అందించగలడని మొదట త్రివిక్రమ్ బలంగా నమ్మాడు.

తమిళంలో సంచలనం

తమిళంలో సంచలనం


అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించాడు. వేగవంతంగా ఈ యువ సంగీత దర్శకుడు పాపులర్ అయ్యాడు. అనిరుద్ అందిస్తున్న బాణీలు సరికొత్తగా వినసొంపుగా ఉండడంతో త్రివిక్రమ్ పట్టు బట్టి మరి అనిరుద్ ని అజ్ఞాతవాసి కోసం చేర్చుకున్నాడు.

ఊహించని రిజల్ట్

ఊహించని రిజల్ట్

అజ్ఞాతవాసి చిత్రం ఊహించని విధంగా నిరాశ పరచడంతో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై ఉహాగానాలు మొదలయ్యాయి.

అనిరుధ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి

అనిరుధ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి

అజ్ఞాతవాసి చితం నిరాశ పరచడంతో ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడని, అనిరుద్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడిని తీసుకోవాలని త్రివిక్రమ్ కు సూచించనినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అనిరుధ్ ని తప్పించినట్లు వార్తలు

అనిరుధ్ ని తప్పించినట్లు వార్తలు


ఈ ప్రాజెక్ట్ నుంచి అనిరుద్ ని తప్పించినట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ ని మెప్పించాలంటే అనిరుద్ సంగీత సరికాదని ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనిరుద్ స్థానంలో మరొక సంగీత దర్శకుడిని తీసుకున్నారట.

 సీన్ లోకి థమన్ ఎంట్రీ

సీన్ లోకి థమన్ ఎంట్రీ

అనిరుధ్ స్థానంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న థమన్ ని ఎంపిక చేశారు. థమన్ ఇటీవల కొన్ని చిత్రాలకు అద్భుతమైన సంగీతాని అందించాడు.

తొలిప్రేమలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్

తొలిప్రేమలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్

ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రానికి థమన్ ది బెస్ట్ మ్యూజిక్ ని అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సంగీతం విషయంలో థమన్ ని అభినందించాల్సిందే. తొలిప్రేమ చిత్రంలో థమన్ సంగీత ప్రభావం అంతలా ఉంది.

మరో టెక్నీషియన్ కూడా అవుట్

మరో టెక్నీషియన్ కూడా అవుట్

కేవలం అనిరుధ్ మాత్రమే కాదు, మరో టెక్నీషియన్ ని కూడా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పించారు. సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అతడి స్థానంలో ఏఎస్ ప్రకాష్ ని తీసుకున్నారు.

ఆందోళన పడాల్సిందేమి లేదు

ఆందోళన పడాల్సిందేమి లేదు

కొన్ని మార్పులు మినహాయించితే ఈ చిత్రం యథాతధంగా మర్చి 26 నుంచి పట్టాలపైకి వెళుతుందని టాక్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరియు ఇతర టీం చర్చించుకునే అవసరమైన మార్పులు చేర్పులు చేశారట.

English summary
Thaman replace with Anirudh for NTR movie. Cinematographer Natarajan Subramaniam also out of the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu