»   » తమన్...ఈ భజన అవసరమా

తమన్...ఈ భజన అవసరమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తను పనిచేసే ప్రతీ సినిమాకు ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో భజన చేస్తూ పోస్ట్ లు పెడుతూ వార్తల్లో ఉండటం సంగీత దర్శకుడు తమన్ కి అలవాటే. ఇప్పుడు తాజాగా అతను పనిచేస్తున్న ఆగడు చిత్రం గురించి ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. తమన్ ట్వీట్ చేస్తూ... "ఇప్పుడే 'ఆగడు' చిత్రం టీజర్ చూసాను... ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ కు బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది. ఆగడు సూపర్ మాస్ " అన్నారు. అయితే ఆగడు వంటి చిత్రానికి కూడా ఇలాంటి భజన అవసరమా అంటున్నారు.

తమన్ ట్వీట్ ద్వారా ఈ సినిమాకు ప్రత్యేకంగా వచ్చే క్రేజ్ ఏముంటుంది అంటున్నారు. ఎలాగూ సూపర్ స్టార్ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తారు. అలాగే ఆగడు చిత్రం సూపర్ మాస్ గా, అద్బుతంగా ఉండే అవకాసం ఉంది. ఇక తొలిసారి ఇలాంటి ట్వీట్ చేస్తే తమన్ ని గ్రేట్ అనొచ్చు. కానీ ప్రతీ సినిమాకూ ఇలాగే టీజర్ అద్బుతం, పాట సూపర్ అంటూ పొగుడుతూ పోస్ట్ లు పెడుతూండటంతో లెక్కలేకుండా పోతోంది.

Thaman tweets on Aagadu teaser

మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' . ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లడఖ్ లోజరుగుతోంది. అక్కడో పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Thaman tweeted .... "I just saw the #teaser of #Aagadu its goona be #superstar urstrulyMahesh Best Everrrrrrr #Aagadu is super mass".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu