twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    20వేల అద్దె ఇంట్లోకి మారాను, అప్పుడు బ్రతకాలనిపించలేదు: నాగబాబు

    ఆరెంజ్ సినిమా తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయినట్లు నాగబాబు తెలిపారు. లక్ష అద్దె ఇంటి నుండి 20వేల అద్దెఇంట్లోకి మారినట్లు తెలిపారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నటుడు నాగబాబు ఆరెంజ్ సినిమా తర్వాత ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వల్ల అంతా పోగొట్టుకున్న ఆయన ఆర్థికంగా బాగా చితికిపోయారు.

    అంజనా ప్రొడక్షన్స్ బేనర్లో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే స్థాయి నుండి...... ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితికి పడిపోయారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు స్వయంగా గుర్తు చేసుకున్నారు.

    అత్యంత దుర్భరమైన స్థితి

    అత్యంత దుర్భరమైన స్థితి

    అవి తన జీవితంలో అత్యంత దుర్భరమైన రోజులు అని.... తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న సందర్భమని... ఆ సమయంలో లక్ష రూపాయల అద్దె ఇంటి నుంచి రూ. 20 వేల అద్దె ఇంటికి మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

    నాపై నాకే జాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

    నాపై నాకే జాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

    అప్పుడు తన పరిస్థితి ఇలా మారిపోయిందేంటా? అని తనపై తానే జాలిపడేవాడినని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించాను, బ్రతికేందుకు కారణాలు కనిపించలేదు, కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయాను అని నాగబాబు తెలిపారు.

    అన్నయ్యను అడగలేక, తమ్ముడికి చెప్పలేక

    అన్నయ్యను అడగలేక, తమ్ముడికి చెప్పలేక

    ఆ సమయంలో అన్నయ్యను అడగలేక, తమ్ముడికి చెప్పలేక తీవ్రమానసిక సంఘర్షణను అనుభవించాను. నా జీవితంలో అంతదారుణమైన మానసిక సంఘర్షనను ఎప్పుడూ ఎదుర్కోలేదని నాగబాబు తెలిపారు.

    నేను అఘాయిత్యం చేసుకుని ఉంటే..

    నేను అఘాయిత్యం చేసుకుని ఉంటే..

    ఆ సమయంలో నేను అఘాయిత్యం చేసుకుని ఉంటే అన్నయ్య, తమ్ముడు పరువు మంటగలిసి పోతుందని కూడా ఆలోచించాను.... అందుకే వెనకడుగు వేశాను అని నాగబాబు గుర్తు చేసుకున్నారు.

    వారే తనకు ఆసరాగా నిలిచారు

    వారే తనకు ఆసరాగా నిలిచారు

    నా పరిస్థితి తెలుసుకుని అన్నయ్య, తమ్ముడు ఆసరాగా నిలిచారు. వారి వల్లే నేను మళ్లీ నిలదొక్కుని పూర్వస్థితికి చేరుకుంటున్నాను అని నాగబాబు తన జీవితంలోని గడ్డు రోజులను గుర్తు చేసుకున్నారు.

    English summary
    Veteran actor Naga Babu has revealed sensational facts of his life. In a recent interview the actor said that for the first time in his life he thought of ending his life after the Orange film loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X