నా జీవితంలో ఆ ఇద్దరూ చాలా స్పెషల్: ఉపాసన
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనప్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఈ ఫోటోలో రామ్ చరణ్ తో పాటు ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి కూడా ఉన్నారు. నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్. వారిలో ఒకరు మా తాత...మరొకరు రామ్ చరణ్ అని ఉపాసన చెప్పుకొచ్చారు. నా జీవితంలో వీరిద్దరి తర్వాతే ఎవరైనా అని ఉపాసన స్పష్టం చేసారు.
రామ్ చరణ్, ఉపానసన మధ్య రిలేషన్ షిప్ ఎంత బాగుటుంతో ఉపాసన సోషల్ మీడియా చెక్ చేస్తే అర్థమవుతుంది. అందులో ఎక్కువ శాతం చరణ్ గురించి పోస్టులే ఉంటాయి. అన్నట్లు రామ్ చరణ్ ను ఉపాసన ముద్దుగా 'మిస్టర్ సి' అని పిలుస్తుంది.
స్లైడ్ షోలో ఉపాసన పోస్టు చేసిన ఫోటోలు...

ఈ ఇద్దరే స్పెషల్
తాత మరియు రామ్. నా జీవితంలో ఈ ఇద్దరు చాలా స్పెషల్ అంటూ ఉపాసన ఈ ఫోటో పోస్టు చేసింది.

మిస్టర్ సి
ఇటీవల రామ్ చరణ్ మూవీ కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడికి ఉపాసన కూడా వెళ్లారు. ఈ సినిమాలో మిస్టిర్ సి షేడ్స్ నా మనసు దోచాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

మాటీవీ అవార్డుల కార్యక్రమంలో..
మాటీవీ అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన

పోజులు..
ఆ మధ్య ఓసారి ఇద్దరూ కలిసి ఫోటో దిగుతుంటే రామ్ చరణ్ తిన్నగా ఉండకుండా ఇలా ఫోజులు కొట్టాడంటూ ఉపాసన ఈ ఫోటో షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











