»   » హాస్యనటుడి మరణం.., దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ

హాస్యనటుడి మరణం.., దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మరుగుజ్జు నటుడిగా తమిళ, తెలుగు పరిశ్రమలో పాపులర్‌ అయిన హాస్యనటుడు తవకలై ఈ ఆదివారం మరణించారు. చెన్నై లోని వడపళనిలో మురుగన్ కోయిల్‌ సమీపంలో నివాసం ఉంటున్న 42 సంవత్సరాల తవకలై ఆదివారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 1983లో భాగ్యరాజ్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ముందానై ముడిచ్చు' చిత్రం ద్వారా తవకలై తమిళ సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. ఇదే సినిమాతో ప్రముఖ హాస్య నటి కోవై సరళ కూడా నటన లోకి అడుగు పెట్టింది.

'ఆనపావం' వంటి పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వంటి అగ్రహీరోలతోను నటించి హస్యనటుడిగా గుర్తింపు పొందారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, సింహళి తదితర ఆరు భాషల్లో దాదాపు 490కిపైగా చిత్రాల్లో తవకలై నటించారు. చిరంజీవి హీరో గా వచ్చిన రాజా విక్రమార్క సినిమాలోనూ రాధిక దొంగల బ్యాచ్ లో ఉండే ఈ నటుడు చేసిన డాన్స్ ఆ సినిమాకే ఒక హైలెట్.

'Thavakalai' Chitti Babu passes away

అయితే కొంతకాలంగా సినీ అవకాశాలు లేకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ లో నటనను కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందారు. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నడిగర్‌ సంఘం సంతాపం తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈ రోజు జరుపనున్నట్టు బంధువులు తెలిపారు.

Read more about: thavakalai comedy actor
English summary
'Thavakalai' Chitti Babu, 42, who debuted in Tamil cinema as a child actor at the age of eight in K Bhagyaraj's 'Munthanai Mudichu' , passed away on Sunday morning due to cardiac arrest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu