twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’కు ఏపీ సర్కార్ షాక్ అంటూ వార్తలు... కానీ అసలు షాక్ ప్రేక్షకుడికే తగులుతోంది

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ చిత్రం 'సాహో'. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో టిక్కెట్ల రేటు పెంపు కోసం నిర్మాతలు అనుమతి కోరడంతో ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇటీవల వార్తలు వెలువడ్డాయి. బుక్ మై షో లాంటి ఆన్ లైన్ బుకింగ్ సైట్లలో కూడా పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులోకి రావడంతో ధరలు పెంచిన విషయం ఖరారైనట్లయింది.

    అయితే ఏపీలో 'సాహో' టికెట్ల ధరల పెంపు లేదు అని అధికారులు చెప్పినట్లుగా తాజాగా మీడియాలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా వ్యవహరించలేమని, ఏ సినిమా అయినా ప్రభుత్వానికి సమానమే అని అధికారులు చెప్పారట.

    అసలు షాక్ తగిలింది ప్రేక్షకుడికే!

    అసలు షాక్ తగిలింది ప్రేక్షకుడికే!

    ‘సాహో'కు ఏపీ సర్కార్ షాక్ అంటూ మీడియా ఛానల్స్‌లో హెడ్ లైన్స్ చూసి సంబర పడిన సగటు ప్రేక్షకుడు.... టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్లను ఆశ్రయిస్తే భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. పెరిగిన ధరలే కొనసాగుతున్నాయి. దీంతో అసలు షాక్ ప్రేక్షకుడికే తగిలినట్లవుతోంది.

    వైజాగ్ ఏరియాలో టికెట్ ధరలు ఇలా...

    వైజాగ్ ఏరియాలో టికెట్ ధరలు ఇలా...

    వైజాగ్ ఏరియాలో ప్రస్తుతం ప్రదర్శితం అవుతున్న కౌసల్య కృష్ణ మూర్తి, రాక్షసుడు లాంటి చిత్రాలకు టికెట్ ధర రూ. 100గా ఉంది. అవే థియేటర్లో ఆగస్టు 30న విడుదలవుతున్న ‘సాహో' విషయంలో మాత్రం ధర రూ. 200గా చూపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి.

    అధికారులపై ఒత్తిడి ఉందా?

    అధికారులపై ఒత్తిడి ఉందా?

    అయితే సాహో టికెట్ల పెంపు విషయంలో ఇప్పటికే సర్కారు నుంచి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి అధికారులపై ఒత్తిడి పెరిగినట్లు టాక్. అందుకే వారు టికెట్ల పెంపు గురించి ప్రస్తావిస్తే అదేమీ లేదు అంటూ నోటి మాట ద్వారా చెబుతున్నారే తప్ప... అఫీషియల్ ఉత్తర్వులు అయితే విడుదల చేయలేదు.

    థియేటర్ల యజమానులకు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకునే అవకాశం ఉందా?

    థియేటర్ల యజమానులకు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకునే అవకాశం ఉందా?

    థియేటర్ల యజమానులకు టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుకునే అధికారం ఉంటుందా? టికెట్ ధరల పెంపు లేదు అంటున్న అధికారులు ఆన్ లైన్లో రేట్లు పెంచి దర్శనమిస్తున్న థియేటర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

    ఏపీ అధికార పక్షం ఏమంటోంది?

    ఏపీ అధికార పక్షం ఏమంటోంది?

    గత ప్రభుత్వ హయాంలో సర్కారుకు, సర్కారులో ఉండే పెద్దకుల సన్నిహితంగా ఉండే స్టార్ల సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారని, జగన్ ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందని

    ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు అంటున్నమాట.

    English summary
    AP government Officialsclear that permission was not given for ticket price hike for Prabhas starrer Saaho.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X