»   » హాట్ అండ్ సెక్సీ: ‘క్యాలెండర్ గర్ల్స్’ అన్‌కట్ ట్రైలర్

హాట్ అండ్ సెక్సీ: ‘క్యాలెండర్ గర్ల్స్’ అన్‌కట్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ స్టైల్. బార్ గర్ల్స్ జీవితంపై 'చాందినీ బార్', మోడలింగ్ రంగంలోని మోడల్స్‌పై 'ఫ్యాషన్', కథానాయికల జీవితంపై 'హీరోయిన్' లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన క్యాలెండర్ గర్ల్స్‌ జీవితం ఎలా ఉంటుదనే విషయంపై సినిమా తెరకెక్కిస్తున్నారు. మన సమాజంలోని వాస్తవిక పరిస్థితులను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్‌ భండార్కర్‌కు మంచి పేరుంది.

ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే ఈ క్యాలెండర్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ‘కింగ్ ఫిషర్' క్యాలెండర్‌ లాంటి వాటి ద్వారా విజయ్ మాల్యా లాంటి వారు తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడం తెలిసిందే. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

The exclusive uncut Trailer of ‎Calendar Girls

హాట్ అండ్ సెక్సీగా నవ్వులు చిందిస్తూ క్యాలెండర్లపై కనిపించే అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది అనే విషయం ఈ సినిమాలో ముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ కట్ ట్రైలర్ విడుదల చేసారు.

ఈ చిత్రంలో ఆకాంక్ష పూరి, అవని మోడి, కైరా దత్, రుహి సింగ్, సటారుప పైనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ఇప్పటికే మోడలింగ్ రంగంలో రాణిస్తున్నా భామలు. హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో బికినీలకు పర్‌పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న ఈ ఐదుగురు అమ్మాయిలను దర్శకుడు మధుర్ బండార్కర్ ఏరి కోరి ఎంపిక చేసారు.

English summary
The exclusive uncut Trailer of ‎Calendar Girls
Please Wait while comments are loading...