Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రాష్ట్రపతికి లేఖ రాసిన హీరో రానా
హైదరాబాదక్: తెలుగు హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందుగానే సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ చిత్రంలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో నటించారు.
ఘాజీ సినిమా ప్రారంభించడానికి ముందు రానా యుద్ధసమయంలో జలాంతర్గామిలో ఉన్న పలువురు ఆర్మీ అధికారులను కలిశారు. ఆ సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు పోరాడిన తీరును రానాకు వివరించారు. అది విని చలించిపోయిన రానా వారి కృషిని అందరూ గుర్తించాలని కోరుతూ ప్రణబ్‌కు లేఖ రాశారు.

'ఘాజి సినిమా అనంతరం సరిహద్దు భద్రత కోసం సైనికులు యుద్ధాల్లో పోరాడి సాధించిన విజయం గురించి నాలాంటి ఎందరో పౌరులు తెలుసుకోగలిగారు. ఓ సామాన్య పౌరుడిగా నాకు ఈ యుద్ధాల గురించి తెలీదు. నాలాంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి అలాంటి నిజమైన హీరోలను గుర్తించాల్సిన అవసరం, వారి గురించి మరిన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. , వారి గొప్పతనం వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని' అంటూ రానా లేఖ ద్వారా విన్న వించారు.
రానాతో పాటు తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితులు ప్రధాన పాత్రలు పోషించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించారు.
తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రానికి తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. 1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు. సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం.